For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Asian Games 2023: భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్ ఇదే..!

హంగ్జౌ: కిక్కెక్కించే బాక్సింగ్‌.. ఉత్తేజపరిచే రన్నింగ్‌.. మంత్రముగ్దుల్ని చేసే బ్యాడ్మింటన్‌.. మజానిచ్చే రెజ్లింగ్‌.. ఇంకా ఎన్నెన్నో! అన్నీ ఒక్క చోటే..! ఆటలే ఆటలు. ఈసారి క్రికెట్‌ బోనస్‌. అభిమానులే ఇక సిద్ధం కావాలి. ఆసియా ఖండంలో అతి పెద్ద క్రీడా సంబరానికి సమయం ఆసన్నమైంది. పొరుగు దేశం చైనా‌లో హాంగ్జౌ వేదికగా ఏషియన్ గేమ్స్ 2023‌కు తెరలేవనుంది.

ఇప్పటికే టీమ్ ఈవెంట్స్ పోటీలు ప్రారంభమైనా.. శనివారం అధికారికంగా ఈ పోటీలు షురూ కానున్నాయి. ఈ ఆసియా గేమ్స్‌కు భారత్ సిద్దమైంది. ఆసియా క్రీడల చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన‌తో 100 పతకాలు సాధించాలనే లక్ష్యంతో 655 మంది సభ్యులతో కూడిన భారత బృందం బరిలోకి దిగుతోంది.

Asian Games 2023: India Full Schedule And Important Dates

41 క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు పోటీపడుతుండగా.. అత్యధికంగా అథ్లెటిక్స్‌ విభాగంలో 68 మంది బరిలోకి దిగుతున్నారు. అక్టోబర్ 8 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్‌ను తేదీల ప్రకారం తెలుసుకుందాం..!

1. సెప్టెంబర్ 23, శనివారం (Asian Games 2023 Schedule)

టేబుల్ టెన్నిస్(పురుషులు, మహిళల టీమ్), రౌండ్ 3 ఉదయం 7.30 గంటలకు ప్రారంభం.

ప్రారంభ వేడుకలు

2.సెప్టెంబర్ 24, ఆదివారం (Asian Games 2023 Schedule)

షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్(వ్యక్తిగత, టీమ్ పోటీలు)- రమితా, మెహులి ఘోష్, అషి చౌస్కీ, (ఉదయం 6 గంటలకు)

మహిళల క్రికెట్: సెమీఫైనల్స్(ఉదయం 6.30 గంటలకు/ 11.30 గంటలకు)

రోయింగ్: ఫైనల్స్(ఉదయం 6.30 గంటలకు)

ఉషూ: రౌండ్ 1 నుంచి ఫైనల్స్(ఉదయం 6.30 నుంచి సాయంత్ర 5 వరకు)

టేబుల్ టెన్నిస్: (పురుషులు, మహిళల టీమ్ విభాగం): రౌండ్ 4, క్వార్టర్ ఫైనల్స్( ఉదయం 7.30 గంటలకు)

టెన్నిస్(రౌండ్1): సుమిత్ నగాల్, అంకిత రైనా, కర్మన్ తాండి(సింగిల్స్), మిక్స్‌డ్ డబుల్స్( ఉదయం 7.30 గంటలకు)

మహిళల రగ్బీ: భారత్ vs హాంగ్ కాంగ్(ఉదయం 9.30)

భారత్ vs జపాన్(మధ్యాహ్నం 2.30 గంటలకు)

బాక్సింగ్ (రౌండ్ 1): నిఖత్ జరీన్(ఉదయం 11.30), జాస్మిన్ లంబోరియా(ఉదయం 11.30), శివ తాప(ఉదయం 11.30), లక్ష్య చాహర్(ఉదయం 11.30), ప్రవీణ్ హుడా(సాయంత్రం 4.30), సంజీత్(సాయంత్ర 4.30)

మహిళల ఫుట్‌బాల్: భారత్ vs థాయిలాండ్(మధ్యాహ్నం 1.30 గంటలకు)

పురుషుల ఫుట్‌బాల్: భారత్ vs మయన్మార్(సాయింత్ర 5 గంటలకు)

3. సెప్టెంబర్ 25, సోమవారం (Asian Games 2023 Schedule)

మహిళల క్రికెట్: మెడల్ మ్యాచ్‌లు (ఉదయం 6:30)

రోయింగ్: ఫైనల్ (ఉదయం 6:30)

షూటింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (వ్యక్తిగత, జట్టు విభాగాలు) - దివ్యాంష్ సింగ్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రంక్ష్ పాటిల్, పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ (వ్యక్తిగత , టీమ్ పోటీలు) - అనిష్, విజయవీర్ సిద్ధు, ఆదర్శ్ సింగ్ (ఉదయం 6:30)

ఉషు: రౌండ్ 1 నుంచి ఫైనల్స్ (ఉదయం 6:30 నుంచి సాయంత్రం 5 వరకు)

జిమ్నాస్టిక్స్ (క్వాలిఫైయింగ్): ప్రణతి నాయక్ (ఉదయం 7:30)

స్విమ్మింగ్ (రౌండ్ 1 నుంచి ఫైనల్స్): లిఖిత్ ఎస్‌పీ (ఉదయం 7:30), ధినిధి దేశింఘు (ఉదయం 7:30), హషికా రామచంద్రన్ (ఉదయం 7:30), విర్ధావల్ ఖాడే (ఉదయం 7:30)

టేబుల్ టెన్నిస్: మానిక బాత్రా/సతియన్ జ్ఞానశేఖరన్ మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ 1, పురుషుల మరియు మహిళల టీమ్ సెమీఫైనల్స్ (ఉదయం 7:30)

టెన్నిస్: సింగిల్స్, డబుల్స్ పోటీలు (ఉదయం 6:30)

జూడో: గరిమా చౌదరి (ఉదయం 7:30 - మధ్యాహ్నం 3:30 వరకు)

రగ్బీ: ఇండియా vs సింగపూర్ (ఉదయం 8:30)

బాక్సింగ్ (రౌండ్ 1): అరుంధతీ చౌదరి (ఉదయం 11:30), దీపక్ భోరియా (ఉదయం 11:30)

హ్యాండ్‌బాల్: భారత్ Vs జపాన్ (ఉదయం 11:30)

మహిళల బాస్కెట్‌బాల్: భారత్ Vs ఉజ్బెకిస్థాన్ (ఉదయం 11:30)

పురుషుల బాస్కెట్‌బాల్: భారత్ Vs ఉజ్బెకిస్థాన్ (సాయంత్రం 5:30)

4. సెప్టెంబర్ 26, మంగళవారం (Asian Games 2023 Schedule)

ఫెన్సింగ్ (రౌండ్ 1 నుంచి ఫైనల్స్): భవానీ దేవి (ఉదయం 6:30)

పురుషుల హాకీ: ఇండియా Vs సింగపూర్ (ఉదయం 6:30)

షూటింగ్: ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ - దివ్యాన్ష్ సింగ్ పన్వర్/రమిత; ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్/మెహులీ ఘోష్ (ఉదయం 6:30)

స్విమ్మింగ్ (రౌండ్ 1 నుంచి ఫైనల్): తనీష్ మాథ్యూ, అనీష్ గౌడ, అద్వైత్ పేజ్, పాలక్ జోషి, ఆనంద్ ఏఎస్ (ఉదయం 7:30)

టెన్నిస్: సింగిల్స్, డబుల్స్ పోటీలు (ఉదయం 6:30)

జూడో (రౌండ్ 1 నుంచి ఫైనల్స్): అవతార్ సింగ్, ఇందుబాలా దేవి, తులికా మాన్ (ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు)

సైక్లింగ్ (రౌండ్ 1 నుంచి ఫైనల్స్): పురుషులు, మహిళల టీమ్ స్ప్రింట్ (ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు)

స్క్వాష్ (రౌండ్ 1): పురుషుల, మహిళల జట్లు

బాక్సింగ్ (రౌండ్ 1): లోవ్లినా బోర్గోహైన్, నిషాంత్ దేవ్, సచిన్, సంజీత్ (ఉదయం 11:30 లేదా సాయంత్రం 4:30)

4. సెప్టెంబర్ 27, బుధవారం (Asian Games 2023 Schedule)

ఈక్వెస్ట్రియన్: డ్రెస్సేజ్, సెమీఫైనల్స్ (ఉదయం 5:30)

ఫెన్సింగ్ (ప్రిలిమినరీ నుంచి ఫైనల్): పురుషుల ఫాయిల్ టీమ్ - దేవ్, అర్జున్, ఆకాష్ కుమార్, బిబిష్ కతిరేసన్ (ఉదయం 6:30); మహిళల ఎపీ టీమ్ - తానిక్ష ఖత్రి, ఎనా అరోరా, యష్కీరత్ కౌర్, జ్యోతిక దత్తా (ఉదయం 9:30)

షూటింగ్: మహిళల 50 మీటర్ల రైఫిల్ 3వ-స్థానం (వ్యక్తిగత, జట్టు విభాగం పోటీలు) - సిఫ్ట్ కౌర్ సమ్రా, ఆషి చౌక్సే, మణిని కౌశిక్

మహిళల 25 మీటర్ల పిస్టల్ (వ్యక్తిగత, జట్టు విభాగం పోటీలు) - రిథమ్ సాంగ్వాన్, మను భాకర్, ఈషా సింగ్; పురుషులు మరియు మహిళల స్కీట్ (వ్యక్తిగత, జట్టు విభాగం పోటీలు) - అనంతజీత్ సింగ్ నరుకా, గుర్జోత్ సింగ్ ఖంగురా మరియు గనేమత్ సెఖోన్, పరీనాజ్ ధాలివాల్, దర్శన రాథోడ్ (ఉదయం 6:30)

సైక్లింగ్ (పురుషుల స్ప్రింట్, ప్రిలిమినరీ రౌండ్): రొనాల్డో సింగ్, రోజిత్ సింగ్, డేవిడ్ బెక్హాం, ఎసోవ్ అల్బన్ (ఉదయం 7:30)

స్క్వాష్ (రౌండ్ 1): మహిళల జట్టు - జోష్నా చినప్ప, దీపికా పల్లికల్ కార్తీక్, అనాహత్ సింగ్, తన్వీ ఖన్నా (ఉదయం 7:30);
పురుషుల జట్టు - సౌరవ్ ఘోషల్, అభయ్ సింగ్, మహేశ్ మంగోంకర్, హరీందర్‌పాల్ సింగ్ సంధు (ఉదయం 10 గంటలకు)

స్విమ్మింగ్ (రౌండ్ 1 నుంచి ఫైనల్): మన పటేల్, లినీషా ఏకే (ఉదయం 7:30)

టేబుల్ టెన్నిస్ (రౌండ్ 1,2): అయ్హికా ముఖర్జీ/సుతీర్థ ముఖర్జీ, దియా చితాలే/శ్రీజ ఆకుల, మానవ్ ఠక్కర్/మనుష్ షా, శరత్ కమల్/సత్యన్ జ్ఞానశేఖరన్, మానికా బాత్రా/ సత్యన్ జ్ఞానశేఖరన్, మానికా బాత్రా, శ్రీజ ఆకుల, శరత్ కమలన్, శరత్ కమల్, (ఉదయం 7:30)

టెన్నిస్: సింగిల్స్, డబుల్స్ పోటీలు (ఉదయం 7:30)

సెయిలింగ్: ఫైనల్స్ (ఉదయం 9)

మహిళల హాకీ: భారత్ vs సింగపూర్ (ఉదయం 10)

మహిళల బాస్కెట్‌బాల్: భారత్ Vs చైనా (ఉదయం 11:30)

బాక్సింగ్ (రౌండ్ 2): శివ థాపా, సంజీత్ (ఉదయం 11:30/సాయంత్రం 4:30)

జిమ్నాస్టిక్స్ (ఫైనల్): ప్రణతి నాయక్ (మధ్యాహ్నం 12:30)

మహిళల హ్యాండ్‌బాల్: ఇండియా Vs హాంకాంగ్ (సాయంత్రం 4:30)

ఉషు (సెమీఫైనల్స్): ఒనిలు తేగా, రోషిబినా దేవి, విక్రాంత్ బలియన్, సూర్య సింగ్, సునీల్ సింగ్ (సాయంత్రం 5గం)

పురుషుల బాస్కెట్‌బాల్: ఇండియా Vs మకావు (సాయంత్రం 5:30)

ఈస్పోర్ట్స్: ఈఏ స్పోర్ట్స్ ఎఫ్‌సీ ఆన్‌లైన్ ఫైనల్ (సాయంత్రం 6 గంటలకు)

5. సెప్టెంబర్ 28, గురువారం

గోల్ఫ్ (రౌండ్ 1): అనిర్బన్ లాహిరి, శుభంకర్ శర్మ, శివ్ చవ్రాసియా, ఖలిన్ జోషి, అదితి అశోక్, అవని ప్రశాంత్, ప్రణవి ఉర్స్ (ఉదయం 3:30)

షూటింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (వ్యక్తిగత & జట్టు) - సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా; స్కీట్ మిక్స్‌డ్ టీమ్ - అనంతజీత్ సింగ్ నరుకా/గణేమత్ సెఖోన్ మరియు గుర్జోత్ సింగ్ ఖంగుర/పరినాజ్ ధాలివాల్ (ఉదయం 6:30)

ఎస్పోర్ట్స్: లీగ్ ఆఫ్ లెజెండ్స్ సెమీఫైనల్స్ (ఉదయం 6:30/ఉదయం 11:30)

ఉషు: వ్యక్తిగత గోల్డ్ మెడల్ మ్యాచ్‌లు (ఉదయం 6:30)

స్విమ్మింగ్ (రౌండ్ 1 నుంచి ఫైనల్స్): అనీష్ గౌడ, ఆర్యన్ నెహ్రా, వృత్తి అగర్వాల్ (ఉదయం 7:30)

సైక్లింగ్: పురుషుల స్ప్రింట్ క్వార్టర్స్ నుంచి ఫైనల్స్ వరకు, మహిళల స్ప్రింట్ - సెలెస్టినా, త్రియషా పాల్, మయూరి లూట్, శశికళ అగసే (ఉదయం 7:30)

టేబుల్ టెన్నిస్ (రౌండ్ 2, 3, క్యూఎఫ్‌లు): సింగిల్స్ మరియు డబుల్స్ (ఉదయం 7:30)

టెన్నిస్ (క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్): సింగిల్స్ మరియు డబుల్స్ (ఉదయం 7:30)

స్క్వాష్ (క్వార్టర్ ఫైనల్స్): పురుషులు మరియు మహిళల జట్లు (ఉదయం 10, మధ్యాహ్నం 2:30)

బ్యాడ్మింటన్ (రౌండ్ 1): పురుషుల జట్టు, మహిళల జట్టు (ఉదయం 10:30) బాక్సింగ్ (రౌండ్ 2): దీపక్ భోరియా, జైస్మిన్ లంబోరియా (ఉదయం 11:30/సాయంత్రం 4:30)

పురుషుల బాస్కెట్‌బాల్: భారత్ వర్సెస్ చైనా (మధ్యాహ్నం 3:30) పురుషుల హాకీ: భారత్ వర్సెస్ జపాన్ (సాయంత్రం 6గం)

Asian Games 2023: India Full Schedule And Important Dates

6. సెప్టెంబర్ 29, శుక్రవారం

గోల్ఫ్: రౌండ్ 2 (ఉదయం 3:30)

అథ్లెటిక్స్: మెడల్ ఈవెంట్స్ - సందీప్ కుమార్, వికాష్ సింగ్, ప్రియాంక గోస్వామి (ఉదయం 5:30), తాన్య కుమారి, రచన కుమారి, కిరణ్ బలియన్, మన్ ప్రీత్ కౌర్ (సాయంత్రం 4:30); హీట్స్ - ఐశ్వర్య మిశ్రా, హిమాన్షి మాలిక్, ఎండి అనాస్, ఎండి అజ్మల్

షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (వ్యక్తిగత & జట్టు) - దివ్య TS, ఈషా సింగ్, పాలక్; పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ (వ్యక్తిగత & జట్టు) - ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ కుసాలే, అఖిల్ షెరాన్ (ఉదయం 6:30)

స్విమ్మింగ్ (రౌండ్ 1 నుంచి ఫైనల్స్): సజన్ ప్రకాష్, కుషాగ్రా రావత్, నీనా వెంకటేష్ (ఉదయం 6:30)

టేబుల్ టెన్నిస్ (రౌండ్ 3, మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్): సింగిల్స్ మరియు డబుల్స్ (ఉదయం 7:30)

టెన్నిస్: పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్ ఫైనల్స్; పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్స్ (ఉదయం 7:30)

స్క్వాష్ (సెమీఫైనల్స్): మహిళల జట్టు (ఉదయం 8:30), మహిళల వ్యక్తిగత (మధ్యాహ్నం 12:30), పురుషుల జట్టు (మధ్యాహ్నం 1:30)

బ్యాడ్మింటన్ (రౌండ్ 2): పురుషులు మరియు మహిళల జట్లు (ఉదయం 10:30, మధ్యాహ్నం 3:30)

బాక్సింగ్ (రౌండ్ 2, క్యూఎఫ్‌లు): పర్వీన్ హుడా, నిఖత్ జరీన్, లక్ష్య చాహర్, సంజీత్ (ఉదయం 11:30/సాయంత్రం 4:30)

సైక్లింగ్ (క్వార్టర్స్ నుంచి ఫైనల్స్): మహిళల స్ప్రింట్ (ఉదయం 11:30)

ఎస్పోర్ట్స్: లీగ్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్ (ఉదయం 11:30)

పురుషుల బాస్కెట్‌బాల్: భారత్ Vs మలేషియా (మధ్యాహ్నం 12గం)

మహిళల హ్యాండ్‌బాల్: భారత్ వర్సెస్ చైనా (మధ్యాహ్నం 3:30)

మహిళల హాకీ: భారత్ Vs మలేషియా (సాయంత్రం 4 గంటలకు)

7. సెప్టెంబర్ 30, శనివారం

గోల్ఫ్: రౌండ్ 3 (ఉదయం 3:30)

ఈక్వెస్ట్రియన్: ఈవెంట్ టీమ్ మరియు వ్యక్తిగత (ఉదయం 5:30)

షూటింగ్: ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ - సరబ్జోత్ సింగ్/దివ్య TS; శివ నర్వాల్/ఈషా సింగ్ (ఉదయం 6:30)

రోలర్ స్పోర్ట్స్: ఆర్తీ కస్తూరి రాజ్ (ఉదయం 6:30)

కెనోయింగ్ & కయాకింగ్: రౌండ్ 1 నుండి సెమీఫైనల్స్ (ఉదయం 7)

కురాష్: రౌండ్ 1 నుండి సెమీఫైనల్స్ (ఉదయం 7)

టేబుల్ టెన్నిస్ (క్వార్టర్ ఫైనల్స్): సింగిల్స్ మరియు డబుల్స్ (ఉదయం 9:30)

బ్యాడ్మింటన్: పురుషుల మరియు మహిళల జట్ల సెమీఫైనల్స్ (ఉదయం 10:30, సాయంత్రం 4:30)

బాక్సింగ్ (క్వార్టర్ ఫైనల్స్): లోవ్లినా బోర్గోహైన్, నిషాంత్ దేవ్, సచిన్ (ఉదయం 11:30/సాయంత్రం 4:30)

మహిళల హ్యాండ్‌బాల్: భారత్ Vs నేపాల్ (ఉదయం 11:30)

స్క్వాష్: పురుషుల మరియు మహిళల టీమ్ ఫైనల్స్ (ఉదయం 11:30, మధ్యాహ్నం 1గం)

వెయిట్ లిఫ్టింగ్: మీరాబాయి చాను, బింద్యారాణి దేవి (1:30pm, 4:30pm)

అథ్లెటిక్స్: మెడల్ ఈవెంట్స్ - పురుషుల 400 మీ, మహిళల 400 మీ, కార్తీక్ కుమార్, గుల్వీర్ సింగ్; హీట్స్ - మురళీ శ్రీశంకర్, జెస్విన్ ఆల్డ్రిన్, జ్యోతి యర్రాజీ, నిత్య రామ్‌రాజ్, అజయ్ సరోజ్, జిన్సన్ జాన్సన్ (సాయంత్రం 3:30)

డైవింగ్: సిద్ధార్థ్ పరదేశి, లండన్ సింగ్ (సాయంత్రం 5)

పురుషుల హాకీ: భారత్ వర్సెస్ పాకిస్థాన్ (సాయంత్రం 6గం)

Asian Games 2023: India Full Schedule And Important Dates

8. అక్టోబర్ 1, ఆదివారం

గోల్ఫ్: ఆల్ ఫైనల్స్ (ఉదయం 3:30)

ఈక్వెస్ట్రియన్: ఈవెంట్ టీమ్ మరియు వ్యక్తిగత (ఉదయం 5:30)

ఆర్చరీ: వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లు - ధీరజ్ బొమ్మదేవర, అతాను దాస్, తుషార్ షెల్కే, మృణాల్ చౌహాన్, అభిషేక్ వర్మ, ఓజస్ డియోటాలే, రజత్ చౌహాన్, ప్రథమేష్ జావ్కర్, ప్రాచీ సింగ్, అంకితా భకత్, భజన్ కౌర్, సిమ్రంజీత్ కౌర్, జ్వనీతి అద్యోత్ కౌర్ స్వామి, పర్నీత్ కౌర్ (ఉదయం 6:30)

పురుషుల ట్రాప్: పృథ్వీరాజ్ తోయిండమాన్, కినాన్ చెనై, జోరావర్ సింగ్ సంధు (ఉదయం 6:30)

బ్రిడ్జ్ (రౌండ్ 2): పురుషులు మరియు మహిళల డబుల్స్, మిక్స్‌డ్ టీమ్ (ఉదయం 6:30)

కెనోయింగ్ & కయాకింగ్: రౌండ్ 1 నుంచి సెమీఫైనల్స్ (ఉదయం 7)

కురాష్: రౌండ్ 1 నుంచి ఫైనల్స్ (ఉదయం 7)

బ్యాడ్మింటన్: పురుషుల మరియు మహిళల టీమ్ ఫైనల్స్ (ఉదయం 10:30, సాయంత్రం 4:30)

బాక్సింగ్ (QFలు మరియు SFలు): పర్వీన్ హుడా, జైస్మిన్ లంబోరియా, అరుంధతీ చౌదరి, శివ థాపా, లక్ష్య చాహర్, సంజీత్ (ఉదయం 11:30/సాయంత్రం 4:30)

మహిళల హాకీ: భారత్ వర్సెస్ కొరియా (మధ్యాహ్నం 1:30)

అథ్లెటిక్స్: పతక ఈవెంట్‌లు - తాజిందర్‌పాల్ సింగ్ టూర్, సాహిబ్ సింగ్, శ్రీశంకర్, జెస్విన్ ఆల్డ్రిన్, అవినాష్ సాబ్లే, సీమా పునియా, హర్మిలన్ బెయిన్స్, కుమారి దీక్షా, అజయ్ సరోజ్, జిన్సన్ జాన్సన్, జ్యోతి యర్రాజీ; హీట్స్ - షైలీ సింగ్, ఆన్సి సోజన్, ఆమ్లన్ బోర్గోహైన్ (మధ్యాహ్నం 3:30)

డైవింగ్: సిద్ధార్థ్ పరదేశి, లండన్ సింగ్ (సాయంత్రం 5)

9. అక్టోబర్ 2, సోమవారం

ఆర్చరీ: వ్యక్తుల రౌండ్ 1-3, టీమ్ రౌండ్ 1 (ఉదయం 6:30)

రోలర్ స్పోర్ట్స్ (రౌండ్ 1 నుంచి ఫైనల్స్): పురుషులు మరియు మహిళల స్పీడ్ స్కేటింగ్ రిలే జట్లు (ఉదయం 6:30)

కానోయింగ్ & కయాకింగ్: ఫైనల్స్ (ఉదయం 7)

బ్యాడ్మింటన్ (రౌండ్ 1): హెచ్‌ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్, పివి సింధు, అశ్మితా చలిహా, సాత్విక్/చిరాగ్, ధ్రువ్/అర్జున్, గాయత్రి/ట్రీసా, తనీషా/అశ్విని, సాయి ప్రతీక్/తనీషా, రోహన్/సిక్కి (ఉదయం 11:30)

స్క్వాష్ (రౌండ్ 1): మిక్స్‌డ్ డబుల్స్, పురుషులు ,మహిళల వ్యక్తిగత (మధ్యాహ్నం 12:30)

ఈక్వెస్ట్రియన్: ఈవెంట్ టీమ్ ,వ్యక్తిగత (12:30pm)

పురుషుల హాకీ: భారత్ Vs బంగ్లాదేశ్ (మధ్యాహ్నం 1గం)

అథ్లెటిక్స్: మెడల్ ఈవెంట్‌లు - పవిత్ర వి, శైలి సింగ్, ఆన్సి సోజన్, పారుల్ చౌదరి, ప్రీతి లాంబా, జ్యోతి యర్రాజీ, ఆమ్లన్ బోర్గోహైన్, మిక్స్‌డ్ 4x400మీ రిలే; హీట్స్ - సర్వేష్ కుషారే, జెస్సీ సందేశ్, క్రిషన్ కుమార్, ఎండీ అఫ్సల్, సంతోష్ కుమార్, యషాస్ పి, సించాల్ రవి, విత్యా రాంరాజ్ (మధ్యాహ్నం 3:30)

డైవింగ్: సిద్ధార్థ్ పరదేశి, లండన్ సింగ్ (సాయంత్రం 4:30)

10. అక్టోబర్ 3, మంగళవారం

ఆర్చరీ: వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ (ఉదయం 6)

పురుషుల క్రికెట్ (క్వార్టర్ ఫైనల్స్): భారతదేశం vs TBC (ఉదయం 6:30)

బ్రిడ్జ్ (సెమీఫైనల్స్): పురుషులు ,మహిళల డబుల్స్, మిక్స్‌డ్ టీమ్ (ఉదయం 6:30)

కానోయింగ్ & కయాకింగ్: ఫైనల్ (ఉదయం 7)

మహిళల హాకీ: భారత్ Vs హాంకాంగ్ (ఉదయం 7:30)

స్పోర్ట్ క్లైంబింగ్: స్పీడ్ ఇండివిజువల్ - అమన్ వర్మ, ధీరజ్ డింకా, అనీషా వర్మ, శివప్రీత్ పన్ను (ఉదయం 7:30)

సాఫ్ట్ టెన్నిస్: రౌండ్ 1 నుంచి క్యూఎఫ్‌లు (ఉదయం 7:30) బ్యాడ్మింటన్ (రౌండ్ 2): సింగిల్స్ ,డబుల్స్ (ఉదయం 10:30)

బాక్సింగ్ (సెమీఫైనల్స్, ఫైనల్స్): నిఖత్ జరీన్, లోవ్లినా బోర్గోహైన్, జైస్మిన్ లంబోరియా, దీపక్ భోరియా, నిశాంత్ దేవ్, సచిన్, శివ థాపా, నరేందర్, సంజీత్ (సాయంత్రం 11:30/4:40)

సెపక్ తక్రా: పురుషులు ,మహిళల క్వాడ్రంట్ సెమీఫైనల్స్ (ఉదయం 11:30)

స్క్వాష్ (క్వార్టర్ ఫైనల్స్): మిక్స్‌డ్ డబుల్స్, పురుషులు ,మహిళల వ్యక్తిగత (మధ్యాహ్నం 12:30)

అథ్లెటిక్స్: హర్మిలన్ బెయిన్స్, కుమారి చందా, రుబీనా యాదవ్, పూజ, ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబకర్, సించాల్ రవి, విత్యా రాంరాజ్, సంతోష్ కుమార్, యషాస్ పి, అంకిత, పరుల్ చౌదరి, అన్నూ రాణి, క్రిషన్ కుమార్, ఎండీ అఫ్సల్ (మధ్యాహ్నం 3:30)

11. అక్టోబర్ 4, బుధవారం

ఆర్చరీ: మిక్స్‌డ్ జట్లు క్వార్టర్స్ నుంచి ఫైనల్‌ వరకు (ఉదయం 6:30)

సెపక్ తక్రా: పురుషులు ,మహిళల క్వాడ్రంట్ ఫైనల్స్ (ఉదయం 6:30)

సాఫ్ట్ టెన్నిస్: సెమీ ఫైనల్స్ ,ఫైనల్స్ (ఉదయం 7:30)

రెజ్లింగ్ (గ్రీకో-రోమన్): జ్ఞానేంద్ర, నీరజ్, వికాష్, సునీల్ కుమార్ (ఉదయం 7:30)

స్క్వాష్ (సెమీ ఫైనల్స్): మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల వ్యక్తిగత (ఉదయం 9:30)

బ్యాడ్మింటన్ (క్వార్టర్ ఫైనల్స్): సింగిల్స్ ,డబుల్స్ (ఉదయం 10:30)

బాక్సింగ్ (ఫైనల్స్): లోవ్లినా బోర్గోహైన్, జైస్మిన్ లాంబోరియా, పర్వీన్ హుడా, లోవ్లినా బోర్గోహైన్, దీపక్ భోరియా, నిశాంత్ దేవ్, శివ థాపా, సచిన్, లక్ష్య చాహర్ (ఉదయం 11:30/సాయంత్రం 4:30) పురుషుల హాకీ: సెమీఫైనల్స్ (1:30)

అథ్లెటిక్స్: సర్వేష్ కుషారే, జెస్సీ సందేశ్, నీరజ్ చోప్రా, కిషోర్ కుమార్ జెనా, షీనా ఎన్, హర్మిలన్ బెయిన్స్, కుమారి చందా, గుల్వీర్ సింగ్, అవినాష్ సేబుల్, మహిళల 4x400 మీటర్ల రిలే, పురుషుల 4x400 మీటర్ల రిలే (మధ్యాహ్నం 3:30)

12. అక్టోబర్ 5, గురువారం

ఆర్చరీ: కాంపౌండ్ పురుషులు , మహిళల జట్లు QFs నుండి ఫైనల్ వరకు (ఉదయం 6:30)

జియు-జిట్సు: క్వాలిఫికేషన్స్ నుంచి ఫైనల్ వరకు (ఉదయం 6:30)

రెజ్లింగ్: గ్రీకో రోమన్ - నరేందర్ చీమా, నవీన్; మహిళల ఫ్రీస్టైల్ - పూజా గెహ్లాట్, యాంటిమ్ పంఘల్, మాన్షి (ఉదయం 7:30)

బ్యాడ్మింటన్ (క్వార్టర్, సెమీ ఫైనల్స్): సింగిల్స్ , డబుల్స్ (ఉదయం 10:30)

బాక్సింగ్ (ఫైనల్స్): పర్వీన్ హుడా, అరుంధతీ చౌదరి, దీపక్ భోరియా, నిశాంత్ దేవ్, సచిన్, లక్ష్య చాహర్, నరేందర్ (ఉదయం 11:30/సాయంత్రం 4:30)

స్క్వాష్: వ్యక్తిగత , మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్స్ (ఉదయం 11:30)

మహిళల హాకీ: సెమీఫైనల్స్ (మధ్యాహ్నం 1:30)

13. అక్టోబర్ 6, శుక్రవారం

ఈక్వెస్ట్రియన్: డ్రెస్సేజ్ టీమ్ , వ్యక్తిగత ఫైనల్ స్టాండింగ్‌లు (ఉదయం 5:30)

ఆర్చరీ: రికర్వ్ పురుషులు , మహిళల జట్లు క్వార్టర్ట్స్ నుంచి ఫైనల్‌ వరకు (ఉదయం 6:30)

పురుషుల క్రికెట్: సెమీఫైనల్స్ (ఉదయం 6:30)

బ్రిడ్జ్ (ఫైనల్స్): పురుషులు, మహిళల డబుల్స్, మిశ్రమ జట్టు (ఉదయం 6:30)

జియు-జిట్సు: క్వాలిఫికేషన్స్ నుంచి ఫైనల్స్ వరకు (ఉదయం 6:30)

కబడ్డీ: పురుషులు , మహిళల సెమీఫైనల్స్ (ఉదయం 7)

రెజ్లింగ్: మహిళల ఫ్రీస్టైల్ - సోనమ్ మాలిక్, రాధిక, కిరణ్; పురుషుల ఫ్రీస్టైల్: అమన్ సెహ్రావత్, బజరంగ్ పునియా (ఉదయం 7:30)

సెపక్ తక్రా: పురుషులు , మహిళల రెగు సెమీఫైనల్స్ (ఉదయం 11:30)

పురుషుల హాకీ: ఫైనల్ (సాయంత్రం 4 గంటలకు)

బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ (సాయంత్రం 4:30)

14. అక్టోబర్ 7, శనివారం

ఆర్చరీ: అన్ని వ్యక్తిగత ఫైనల్స్ (ఉదయం 6:30)

సెపక్ తక్రా: పురుషులు ,మహిళల రెగు ఫైనల్స్ (ఉదయం 6:30)

జియు-జిట్సు: క్వాలిఫికేషన్స్ నుంచి ఫైనల్స్ వరకు (ఉదయం 6:30)

కబడ్డీ: మహిళల ఫైనల్ (ఉదయం 7 గంటలకు), పురుషుల ఫైనల్ (మధ్యాహ్నం 12:30)

రెజ్లింగ్: పురుషుల ఫ్రీస్టైల్ - యష్, దీపక్ పునియా, విక్కీ, సుమిత్ (ఉదయం 07:30)

బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్ ఫైనల్స్ (ఉదయం 10:30)

పురుషుల క్రికెట్: ఫైనల్ (ఉదయం 11:30)

మహిళల హాకీ: ఫైనల్ (సాయంత్రం 4 గంటలకు)

15. అక్టోబర్ 8, ఆదివారం

ముంగిపు వేడుకలు

Story first published: Thursday, September 21, 2023, 13:49 [IST]
Other articles published on Sep 21, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+