Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2023: 72 ఏళ్ల తర్వాత సెంచరీ కొట్టిన భారత్!

హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత్ చరిత్ర సృష్టించింది. 100 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత అథ్లెట్లు టార్గెట్‌ను రీచ్ అయ్యారు. 72 ఏళ్ల తర్వాత 100 పతకాల మార్క్‌ను అందుకొని చరిత్ర సృష్టించాడు. 2018 ఆసియా గేమ్స్‌లో 70 పతకాలు రాగా.. ఇప్పటికే ఈ రికార్డును అధిగమించారు.

ప్రస్తుతం భారత్ 94 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 21 స్వర్ణాలు, 34 రజతాలు, 39 కాంస్యపతకాలున్నాయి.శుక్రవారం నాలుగు పతకాలు రాగా.. ఇందులో ఓ రజతం మూడు కాంస్యాలున్నాయి. రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు ఫైనల్లో సౌత్ కొరియా చేతిలో ఓటమిపాలై రజత పతకం దక్కించుకుంది. బ్యాడ్మింటన్ సింగిల్స్ ప్రణయ్ సెమీస్‌లో ఓడి బ్రాంజ్ మెడల్ సాధించాడు. సెపక్‌తక్రా ఈవెంట్‌లో భారత మహిళా జట్టుకు కాంస్య రాగా.. మహిళల రికర్వ్ ఆర్చర్ టీమ్ మరో బ్రాంజ్ మెడల్ సాధించింది.

Asian Games 2023:

పురుషుల క్రికెట్ జట్టులో ఫైనల్ చేరిన భారత జట్టు కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. శనివారం జరిగే ఫైనల్లో అఫ్గానిస్థాన్‌ను ఓడిస్తే భారత్‌కు స్వర్ణం దక్కనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియాకు అఫ్గాన్‌ను ఓడించడం పెద్ద కష్టమేమి కాదు.

కబడ్డీ పురుషుల విభాగంలోనూ భారత జట్టు ఫైనల్ దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భారత్ 61-14 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఓటమెరుగకుండా ఫైనల్ చేరిన భారత పురుషుల కబడ్డీ జట్టుకు స్వర్ణం రావడం ఖాయం. మహిళల కబడ్డీ జట్టు సైతం ఫైనల్ చేరి మెడల్ ఖాయం చేసింది. కాంపౌండ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ, ఓజాస్ ప్రవీణ్ ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేశారు.

బ్రిడ్జ్ ఈవెంట్‌లోనూ భారత ఫురుషుల జట్టు ఫైనల్ చేరింది. ఈ ఈవెంట్‌లో కూడా మెడల్ దక్కనుంది. బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీస్‌లో మలేషియా జోడీ తలపడుతున్నారు. గెలిస్తే ఫైనల్‌కు వెళ్లనున్న ఈ జోడీ ఓడితే బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది. మహిళల ఆర్చరీ విభాగంలోననూ జ్యోతి సురేఖ ఫైనల్ చేరి పతకం ఖాయం చేసింది. ఇప్పటికే 94 పతకాలు ఖాతాలో చేరగా.. మరో 7 మెడల్స్ ఖాయం అయ్యాయి. ఈ లెక్కన భారత పతకాల సంఖ్యం 100 ధాటింది.

Story first published: Friday, October 6, 2023, 17:31 [IST]
Other articles published on Oct 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+