For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Asia Games 2023: వాలీబాల్ టీమ్ సంచలన విజయం.. ఫ్లాగ్ బేరర్లుగా హర్మన్‌ సింగ్, లవ్లీనా!

హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల వాలీబాల్ టీమ్ దుమ్మురేపుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన పూల్-సి మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో గత ఎడిషన్ సిల్వర్ మెడలిస్ట్ సౌత్ కొరియాను ఓడించి సంచలన విజయాన్నందుకుంది.

ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో అమిత్ గులియా, అశ్వల్ రాయ్ కీలక పాయింట్లతో టీమ్‌ను గెలిపించారు. మంగళవారం తొలి మ్యాచ్‌లో భారత్ 3-0తో కంబోడియాను ఓడించి ఐదు పాయింట్లో పూల్ సీ‌లో టాప్ ప్లేస్ సాధించి నాకౌట్‌కు అర్హత సాధించింది. తదుపరి రౌండ్‌లో భారత్, చైనీస్ తైపీ లేదా మంగోలియాతో తలడనుంది.

Asia Games 2023: Indian volleyball team Stuns South Korea To Enter Knockout Stage

ఆసియా గేమ్స్‌లో భారత వాలీ బాల్ టీమ్ ఇప్పటి వరకు ఒకే ఒక్క మెడల్ సాధించింది. 1986లో కాంస్య పతకం నెగ్గింది. గత ఎడిషన్‌లో 12వ స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు రోయింగ్‌లో భారత పురుషుల ఫోర్ కాక్స్‌లెస్ టీమ్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. జవీందర్ సింగ్, భీన్ సింగ్, పునీత్ కుమార్, ఆశీష్‌తో కూడిన జట్టు హీట్స్‌లో టాప్ ప్లేస్ సాధించింది.

మహిళల కాక్స్‌లెస్, మెన్స్ కాక్స్‌డ్ ఎయిట్స్ టీమ్ కూడా ఫైనల్ రేసుకు అర్హత సాధించింది. ఆసియా గేమ్స్ అధికారికంగా శనివారం ప్రారంభం కానున్నాయి. అయితే కొన్ని ఈవెంట్స్ ఇప్పటికే మొదలయ్యాయి.

ఆసియా గేమ్స్ ఆరంభ వేడుకల్లో భారత పతకదారులుగా పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ఒలింపిక్ మెడలిస్ట్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఎంపికయ్యారు. శనివారం జరిగే ఈ వేడుకల్లో ఈ ఇద్దరూ త్రివర్ణ పతాకంతో భారత అథ్లెట్ల ముందుండి నడిపించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ఇద్దరు ఫ్లాగ్ బేరర్లు ఉండాలని భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నిర్ణయించింది. కాగా, ఆసియా గేమ్స్‌లో భారత్ ఈసారి అత్యధికంగా 655 మంది అథ్లెట్లను బరిలోకి దింపుతోంది.

Story first published: Thursday, September 21, 2023, 10:00 [IST]
Other articles published on Sep 21, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+