Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Arshad Nadeem: గెలిచింది బంగారు పతకమే కానీ.. బుర్రనిండా పెండే..!

ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్థాన్ బళ్లెం వీరుడు అర్షద్ నదీమ్ ఈటెను 92.47 మీటర్లు విసిరి ఒలింపిక్ రికార్డుతో పాటు బంగారు పతకం సాధించాడు. 32 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు ఒలింపిక్ మెడల్ అందించడంతో పాటు వ్యక్తిగత గోల్డ్ గెలిచిన తొలి అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. అర్షద్ నదీమ్ రికార్డ్‌తో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కూడా రెండో స్థానానికి పరిమితమయ్యాడు.

ప్రస్తుతం అర్షద్ నదీమ్‌‌పై ప్రశంసల జల్లుతో పాటు రివార్డ్స్ వర్షం కురుస్తోంది. ఇప్పటికే అర్షద్ నదీమ్‌కు కార్లు, డబ్బు, యాడ్స్ రూపంలో చాలా బహుమానాలు దక్కాయి. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఆ దేశ అత్యున్నత పురస్కారం హిలాల్ ఈ ఇంతియాజ్‌తో సత్కరించింది.

Arshad Nadeem trolled after his Reaction To Buffalo Gift From Father In Law

ఒలింపిక్స్‌కు వెళ్లడానికి అర్షద్ నదీమ్‌కు కనీస ఖర్చులు కూడా లేకపోవడంతో.. సొంత గ్రామస్తులు చందాలు వేసుకొని అతనికి కొత్త జావెలిన్ కొనివ్వడంతో పాటు.. అన్ని ఖర్చులు సమకూర్చారు. అంతే కాకుండా గోల్డ్ గెలిచి వచ్చాక.. భారీ ఊరేగింపుతో ఘనస్వాగతం పలికారు. అర్షద్ నదీమ్‌ మామ(సతీమణి తండ్రి) అతనికి బర్రెలను బహుమానంగా ఇచ్చాడు.

అయితే ఈ గిఫ్ట్‌పై అర్షద్ నదీమ్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒలింపిక్స్ నుంచి వచ్చిన తర్వాత అర్షద్ నదీమ్‌ను అనేక మీడియా ఛానల్స్‌ ఇంటర్వ్యూ చేశాయి. ఈ క్రమంలో ఒక ఛానల్ ప్రతినిధితో అర్షద్ నదీమ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

'ఒలింపిక్స్ గెలిచిన తర్వాత మా మామ నాకు బర్రెలు బహుమానంగా ఇచ్చారు. ఒక నాలుగైదు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తారని నేను ఆశించాను. కానీ అతను మాత్రం బర్రెలు ఇస్తానని నా భార్యకు చెప్పారు. ఆయన చాలా డబ్బున్నవారు. ఇలా బర్రెలు ఇస్తారని ఊహించలేదు. భూమి ఇస్తే బాగుండేది 'అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అర్షద్ నదీమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఇంకా సతీమణి ఫ్యామిలీ నుంచి ఏదో ఆశించడం చూస్తుంటే అర్షద్ నదీమ్ మనస్తత్వం ఏంటో అర్థం అవుతుందని, అతని బుర్రా నిండా పెండే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అతను పాకిస్థాన్‌కే ఓ ఐకాన్ అనే విషయం మరిచిపోయాడని, అతని కోసం కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయని, తలుచుకుంటే తన మామ ఇచ్చే భూమి కంటే ఎక్కువే కొనుక్కోవచ్చని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Saturday, August 17, 2024, 13:36 [IST]
Other articles published on Aug 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+