సంచలన విషయాన్ని బయటపెట్టిన అంజూ.. ఒక్క కిడ్నీతోనే..!!

హైదరాబాద్: స్టార్ ఒలింపియన్ అంజూ బాబీ జార్జి భారత అథ్లెటిక్స్‌కే వన్నె తెచ్చింది. లాంగ్‌జంప్‌లో తన పతకాలతో చరిత్ర సృష్టించింది. దేశానికి ఎంతో సేవ అంజూ తాజాగా సంచలన విషయం బయటపెట్టింది. తాను సుదీర్ఘ కాలం కిడ్నీ సమస్యలతో సతమతమయ్యానని 43 ఏళ్ల అంజూ చెప్పారు. పోటీల్లో తలపడే సమయానికే ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. దీంతో కేవలం ఒకే కిడ్నీతో ఆమె ఒంట్లో ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే బయట ఈవెంట్లలో ప్రత్యర్థులతో పోటీ పడినట్లు పేర్కొన్నారు.

ఒక్క కిడ్నీతోనే
దేశ అథ్లెటిక్స్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ విజయాలను ఒక్క కిడ్నీతోనే సాధించానని అంజూ బాబీ జార్జి సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా ఒక్క కిడ్నీతో ప్రపంచంలో అత్యుత్తమ స్థానాన్ని అందుకున్న అథ్లెట్లలో నేను ఒకదాన్ని కావడం నా అదృష్టం. కనీసం పెయిన్ కిల్లర్ తీసుకున్నా అది వికటించడం, వేగంగా స్పందించని కాలు.. ఇలా ఎన్నో పరిమితులున్నా విజయాలు అందుకున్నా. అందుకు కారణం కోచ్ మాయాజాలమని చెబుదామా? లేదా అతని నైపుణ్యమందామా' అని 43 ఏళ్ల అంజూ ట్వీట్ చేశారు.

నా భర్త ప్రోత్సహించారు
'నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఎన్నో సవాళ్లు దాటి విజయాలు సాధించా. నా అనుభవాలను పంచుకోవడం ద్వారా యువ అథ్లెట్లకు స్ఫూర్తి కలిగిస్తాననే నమ్మకంతో ఉన్నా. 2001లో ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే.. నాకు పుట్టుక నుంచి ఒక్కటే కిడ్నీ ఉందని తెలిసి షాక్‌కు గురయ్యా. కానీ కెరీర్ కొనసాగించేలా నా భర్త ప్రోత్సహించారు. సమస్య ఎదురైతే తన కిడ్నీ ఇస్తానని చెప్పారు. 2003లో ప్రపంచ అథ్లెటిక్స్‌కు 20 రోజుల ముందు అనారోగ్యం బారిన పడ్డా. ఆరు నెలల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. కానీ ఆ సమస్యను అధిగమించి పోటీల్లో పాల్గొని పతకం సాధించా' అని అంజూ ట్వీట్ చేశారు.

రజతం.. పసిడిగా
2003లో ప్యారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌లో 6.70 మీటర్లు దూకిన అంజూ కాంస్యం గెలిచారు. 2005 ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్‌లో 6.75 మీటర్లు దూకి రజతం గెలుచుకుంది. స్వర్ణం గెలిచిన రష్యా అథ్లెట్ కోటోవా డోపీగా తేలడంతో 2014లో అంజూ రజతం.. పసిడిగా మారింది. 2004 ఒలింపిక్స్‌లో తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన (6.83 మీ)తో ఆరో స్థానంలో నిలిచారు. ఇప్పటికీ జాతీయ రికార్డు ఆమె ఖాతాలోనే ఉంది. ఇవే కాకుండా ఆసియా క్రీడల్లో ఓ స్వర్ణం (2002 బుసాన్), ఓ రజతం (2006 దోహా), కామన్వెల్త్ క్రీడల్లో ఓ కాంస్యం (2002 మాంచెస్టర్) గెలిచారు.
India vs Australia: మూడో టీ20.. ధోనీ అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications