Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CWG 2026: మెరిసిన తెలుగు తేజం.. భారత్‌కు మరో పతకం

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ జోరు కొనసాగుతోంది. భారత్ వెయిట్ లిఫ్టర్, తెలుగు తేజం వల్లూరి అజయ్ బాబు అద్భుత ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సాధించాడు. పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరిలో అజయ్ బాబు రెండో స్థానంలో నిలిచి ఈ ఘనతను అందుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన 21 ఏళ్ల అజయ్‌ బాబు మొత్తం 330 కేజీల బరవు ఎత్తి కేజీ తేడాలో స్వర్ణాన్ని చేజార్చుకున్నాడు. స్నాచ్‌లో 149 కిలోల బరువు ఎత్తిన విజయ్‌బాబు.. క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కిలోల బరువు ఎత్తాడు. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ఇది ఐదో రజతం కావడం విశేషం.

మలేషియాకు చెందిన హిదయత్ ముహమ్మద్ 331 కేజీలతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించాడు. స్నాచ్‌లో 147 కేజీలు ఎత్తిన అతను.. క్లీన్ అండ్ జెర్క్‌లో మాత్రం 184 కేజీల బరువు ఎత్తి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌‌కు చెందిన క్రిస్ ముర్రే 325 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

Andhra Pradesh s Ajaya Babu Wins Silver Medal In Men s 79kg Weightlifting At Commonwealth Games 2026
కామెన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్.. భారీ నజరానా ప్రకటించిన సీఎం విజయ్!

కామెన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్.. భారీ నజరానా ప్రకటించిన సీఎం విజయ్!

అజయ్‌బాబు సరికొత్త రికార్డ్..

స్నాచ్‌లో తొలి ప్రయత్నంలోనే 145 కేజీల బరువు ఎత్తిన అజయ్‌బాబు.. మూడో ప్రయత్నంలో 149 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్‌లో స్నాచ్‌లో అత్యధిక బరువు ఎత్తిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. స్నాచ్‌లో రికార్డ్ సాధించడంతో అజయ్‌బాబు బంగారు పతకం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ మలేషియా వెయిలిఫ్టర్ హిదయత్ ముహమ్మద్ క్లీన్ అండ్ జెర్క్‌లో ఏకంగా 184 కేజీలు ఎత్తి అగ్రస్థానంలో నిలిచాడు. అజయ్ మాత్రం 181 కేజీల బరువే ఎత్తి తృటిలో గోల్డ్ మెడల్ కోల్పోయాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం కావడం గమనార్హం.

తండ్రి కోచింగ్‌లో..

విజయనగరం జిల్లాలోని కొండవెలగడ అనే కుగ్రామం నుంచి వచ్చిన అజయ్.. తన తండ్రి, మాజీ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ అయిన వల్లూరి శ్రీనివాస్ రావు ప్రోత్సాహంతో వెయిట్ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. తండ్రి కోచింగ్‌లోనే చిన్న వయసులో అజయ్ భారత స్టార్ వెయిట్ లిఫ్టర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం అతను అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(ఎన్‌సీఓఈ)లో శిక్షణ పొందుతున్నాడు.

అతనే లేకుంటే సచిన్ క్రికెట్ గాడ్ అయ్యేవాడు కాదు.. ఆ ఒక్క సాయం!

అతనే లేకుంటే సచిన్ క్రికెట్ గాడ్ అయ్యేవాడు కాదు.. ఆ ఒక్క సాయం!

కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు అజయ్ పలు పతకాలను సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా గతేడాది జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించాడు. 2024 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ సీనియర్, జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు గెలిచాడు. 2024 ఏషియన్ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ సాధించాడు.

Story first published: Tuesday, July 28, 2026, 8:38 [IST]
Other articles published on Jul 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+