సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం క్రీడాకారులకు వరంగా మారింది

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రీడాకారులకు వరాల జల్లు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాకాలు అందించాలని నిర్ణయించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు.
నెటిజన్ ప్రశ్న: అలియా భట్ ఎవరో తెలియదన్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్
గతంలో ఎవరూ క్రీడల గురించి, క్రీడాకారుల గురించి పట్టించుకోలేదని వారికి ప్రోత్సాహకం అందిస్తే ప్రతి ఒక్కరూ పీవీ సింధూలవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత జాతీయస్థాయిలో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకం అందించేలా నిర్ణయం తీసుకున్నారు.

క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ
ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ "దిగువ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలి. ప్రతిభ ఉన్న రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 2014 రాష్ట్ర విభజన తర్వాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు ఇద్దాం. బంగారు పతకం సాధించిన వారికి రూ.5 లక్షలు, వెండి పతకం సాధించిన వారికి రూ.4 లక్షలు, కాంస్యం గెలుచుకున్న వారికి రూ.3 లక్షలను బహుమతిగా ఇద్దాం" అని జగన్ అన్నారు.

తగిన ప్రోత్సాహం అందించాలని
జూనియర్, సబ్ జూనియర్ స్థాయి క్రీడాకారులను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించాలని అన్నారు. ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించిన వారికి రూ. 1.25 లక్షలు, రజతం వచ్చిన వారికి రూ. 75 వేలు, కాంస్యం వచ్చిన వారికి రూ. 50 వేల ప్రోత్సాహకం ఇస్తేనే వీళ్లంతా పీవీ సింధులా మారుతారని సీఎం అన్నారు.

ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా
ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం నుంచి ఈ కార్యక్రమాలు వారం రోజుల పాటు కొనసాగాలని వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కాగా, ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (బీడబ్ల్యూఎఫ్) మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు చరిత్ర సృష్టించింది.

తొలి భారతీయురాలిగా సింధు రికార్డు
ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21-7, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది. సింధు కేవలం 38 నిమిషాల్లో ఒకుహారాను మట్టికరిపించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన పీవీ సింధుకు బాయ్ రూ. 20 లక్షలు నగదు పురస్కారం ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications