Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లాక్‌డౌన్‌లో బిజీబిజీ.. గుర్రపు స్వారీ‌.. ట్రాక్టర్‌ డ్రైవింగ్‌!!

Ace shooter Manu Bhaker takes to driving tractors, riding horses and painting

చండీగఢ్‌: కరోనా వైరస్ మహమ్మారితో మూడు నెలలుగా ఆటలన్నీ పూర్తిగా స్థంభించి పోగా.. క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది అథ్లెట్లు ఇంట్లోనే కసరత్తులు చేస్తూ ఫిట్‌నె్‌సను పెంచుకోవడంపై దృష్టి సారించారు. అయితే భారత స్టార్‌ షూటర్‌ మను బాకర్ ఒకవైపు ఫిట్‌నె్‌సను మెరుగుపరుచుకుంటూనే.. మరోవైపు‌ కొత్త వ్యాపకాలు నేర్చుకుంటోంది.

ఇతర వ్యాపకాలతో బిజీబిజీ:

ఇతర వ్యాపకాలతో బిజీబిజీ:

మను బాకర్ లాక్‌డౌన్‌లోనూ కొత్త విషయాలు నేర్చుకుంటోంది. మను ఓ వైపు ఇంట్లో సాధన కొనసాగిస్తూనే.. మరోవైపు పొలాల్లో ట్రాక్టర్‌ను నడిపించడంతో పాటు గుర్రాన్ని దౌడు (హార్స్‌ రైడింగ్‌) తీయిస్తోంది. ఇక సరదా కోసం బొమ్మలు (చిత్రలేఖనం) కూడా గీస్తోంది. ఈ విషయాలను స్వయంగా ఆమెనే వెల్లడించింది. మొత్తానికి మను బాకర్ షూటింగ్‌తో పాటు ఇతర వ్యాపకాలతో బిజీబిజీగా గడుపుతోంది. టోర్నీలు లేకపోవడంతో ఇంట్లో కూర్చోవడం బోర్‌గా అనిపించి.. 18 ఏళ్ల ఏస్ షూటర్ హర్యానాలోని జజ్జార్‌ జిల్లాలోని గోరియా గ్రామంకు వెళ్ళింది.

గుర్రపు స్వారీ చేస్తున్నా: '

గుర్రపు స్వారీ చేస్తున్నా: '

కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలై చాలా కాలమవుతోంది. ఈ సమయంలో ఇంట్లోనే ఉండడంతో బొమ్మలు గీస్తున్నా. గుర్రపు స్వారీ చేస్తున్నా. పొలాల్లో ట్రాక్టర్‌ నడిపిస్తున్నా. షూటింగ్‌పైనే దృష్టి నిలిపేందుకూ ప్రయత్నిస్తున్నా. సాధన తీవ్రంగా కొనసాగిస్తున్నా. మానసికంగా, శారీరకంగా బలంగా ఉండేందుకు యోగా, ధ్యానం చేస్తున్నా. దాంతో ఆటపై ఏకాగ్రత పెట్టడం సాధ్యమవుతుంది' అని మను తెలిపింది.

పోటీతత్వం తిరిగి వస్తుంది:

పోటీతత్వం తిరిగి వస్తుంది:

'కొద్ది నెలలుగా ఎలాంటి పోటీల్లో పాల్గొనలేదు. శిక్షణ శిబిరాలు కూడా రద్దయ్యాయి. కానీ నేను గ్రామంలో సాధన చేస్తూ ఆటపైనే దృష్టి పెట్టా. లాక్‌డౌన్‌ తర్వాత శిక్షణ శిబిరాలు ఉంటాయని అనుకుంటున్నా. ఆ తర్వాత టోర్నీలు మొదలయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి పోటీలు ఆరంభమైతే ఆ వాతావరణానికి తొందరగానే అలవాటు పడతాం. శిబిరాల్లో చేరగానే ఆ పోటీతత్వం తిరిగి వస్తుంది' అని మను బాకర్ పేర్కొంది. వైరస్ కారణంగా ఒత్తిడికి గురవుతున్న యువ అథ్లెట్లు దాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడాలని మను సూచించింది.

నేడు ఐసీసీ కీలక సమావేశం.. చైర్మన్‌ ఎన్నికే ప్రధాన ఎజెండా!!

Story first published: Thursday, June 25, 2020, 15:14 [IST]
Other articles published on Jun 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+