టీవీలో చూస్తూ
మీరాబాయి చానును అనుకరిస్తూ ఒక చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 49 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచిన మీరాను టీవీలో చూస్తూ అచ్చం ఆమెను దింపేసింది. మీరా వెయిట్ లిఫ్ట్ చేసిన వీడియోనూ చూస్తూ.. ఆ చిన్నారి కూడా తన ముందు ఒక వెయిట్ లిఫ్టింగ్‌ను సిద్దం చేసుకుంది. నమస్కారం చేసిన తర్వాత అచ్చం ఆమెలానే వెయిట్ ఎత్తింది ఆ చిన్నారి. తన హావభావాలతో అందరిని మెప్పించింది. ఇక మెడల్ ప్రెజంటేషన్లో భాగంగా మీరాబాయి మెడల్ ధరించినట్టుగానే చిన్నారి కూడా తన మెడలో ఒక మెడల్ వేసుకొని ముసిముసిగా నవ్వింది. ఆంతేకాదు గంతులు కూడా వేసింది.
|
సో క్యూట్
చిన్నారికి సంబందించిన వీడియోను మాజీ వెయిట్‌లిఫ్టర్ సతీష్ శివలింగమ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. మీరాబాయి చాను రిప్లై ఇచ్చింది. ఈ చిన్నారి భలేగా చేసిందని ఆమె ప్రశంసించింది. 'సో క్యూట్.. చాల బాగా నచ్చింది'అని రీట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 'జూనియర్ మీరాబాయి చాను' అని ఒకరు కామెంట్ చేయగా.. 'మరో మీరాబాయ్ చాను దొరికేసింది' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'సూపర్ చిన్నారి', 'బుల్లి మీరాబాయి చాను అదరగొట్టేసింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Mirabai Chanuకు మరో బంపర్ ఆఫర్.. రూ.2 కోట్లతో పాటు!!
202 కిలోలు ఎత్తి
మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కిలోల పోటీల్లో మీరాబాయి చాను రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 49 కిలోల పోటీల్లో చైనా అథ్లెట్ హు జిహుయి 210 కిలోలు ఎత్తి పసిడి పతకం కైవసం చేసుకుంది. స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కిలోలు ఎత్తి ఘన విజయం సాదిందింది. మరోవైపు మీరాబాయి స్నాచ్‌లో 87కి, క్లీన్ అండ్ జెర్క్‌లో 115కి.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రజతం కైవసం చేసుకుంది. అయితే జిహుయిపై డోపింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ జిహూయి డోపింగ్ పరీక్షల్లో విఫలమైతే.. మీరాబాయి రజతాన్ని స్వర్ణానికి ఉన్నతీకరిస్తారు.