Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024 బరిలో 61 ఏళ్ల బామ్మ..!

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో 61 ఏళ్ల బామ్మ పోటీపడుతోంది. ఆమె వయసు వాళ్లు ఎప్పుడో ఆటను వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంతమంది కోచ్‌లుగా మారి యువ ప్లేయర్లను తయారు చేస్తున్నారు. కానీ ఆ 61 ఏళ్ల బామ్మ మాత్రం పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచి యువతరంతో పోటీపడుతోంది. ఆ బామ్మే జిల్ ఇర్వింగ్.. 'బామ్మ ఆట బంగారు బాట'అన్నట్లు పసిడి పతకమే లక్ష్యంగా పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచింది.

కెనడాకు చెందిన జిల్ ఇర్వింగ్.. 61 ఏళ్ల వయసులో అత్యంత కష్టమైన ఈక్వెస్ట్రియన్‌లో పోటీ పడుతోంది. ఆరు పదుల వయసు ధాటినా గుర్రాల స్వారీ ఆటలో పోటీ పడుతూ యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈక్వెస్ట్రియన్ టీమ్ విభాగంలో ఈ బామ్మ పోటీపడుతోంది.

61 Years Old Jill Irving is the oldest competitor in Paris Olympics 2024

పారిస్ ఒలింపిక్స్ 2024లో పోటీపడుతున్న అత్యంత పెద్ద వయస్కురాలిగా జిల్ ఇర్వింగ్ రికార్డ్ సాధించింది. అయితే ఒలింపిక్స్‌కు ఆమె అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గుర్రాల స్వారీ అంటే జిల్ ఇర్వింగ్‌కు చాలా ఇష్టం. దాంతో ఆమె 2008లో ప్రొఫెషనల్‌ ఈక్వెస్ట్రియన్ ప్లేయర్‌గా మారింది.

2019 పాన్ అమెరికా క్రీడల్లో కెనడా ఈక్వెస్ట్రియన్ టీమ్ స్వర్ణం సాధించడంలో జిల్ ఇర్వింగ్ కీలక పాత్ర పోషించింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా.. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె ఆడే గుర్రానికి వయోభారం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. కానీ నిరుత్సాహానికి గురికాకుండా మరింత కష్టపడి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

చైనా స్కేటింగ్ బోర్డ్ ప్లేయర్ జెంగ్ పారిస్ బరిలో నిలిచిన అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డు సాధించింది. 11 ఏళ్ల 11 నెలల వయసులో జెంగ్ పారిస్ ఒలింపిక్స్ ఆడుతోంది.

Story first published: Wednesday, July 24, 2024, 10:29 [IST]
Other articles published on Jul 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+