Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దీపిక పల్లికల్.. నవ్వితే గుండె జిగేల్! అందంతో పాటు ఆటతో ఆకట్టుకుంటున్న దినేశ్ కార్తీక్ భార్య!

 5 Hottest Photos Of Dinesh Karthiks Wife Dipika Pallikal Which Went Viral On Social Media

న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ బ్రాంజ్ మెడల్‌తో సత్తా చాటింది. వ్యక్తిగత విభాగంలో విఫలమైనా.. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సత్తా చాటింది. సౌరభ్ ఘోషల్‌తో జతకట్టిన పల్లికల్ అద్భుత ప్రదర్శన కనబర్చి పతకాన్ని సాధించింది. కాంస్యపతక పోరులో దీపిక జంట 11-8, 11-4తో లొబాన్-పిలీ(ఆస్ట్రేలియా)ను ఓడించింది. మెడల్ సాధించిన పల్లికల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా అభినందించారు. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన పల్లికల్ అద్భుత ప్రదర్శన పతకాలు సాధించడం ప్రతీ ఒక్కరికి స్పూర్తినిచ్చే అంశం.

 అందంతోనే ఫేమస్..

అందంతోనే ఫేమస్..

అయితే పల్లికల్ తన ఆట కంటే దినేశ్ కార్తీక్ భార్యగానే ఎక్కువ గుర్తింపు పొందింది. అత్యున్నత వేదికలపై అనేక పతకాలు సాధించినా.. భారత్‌లో స్క్వాష్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఆమెకు గుర్తింపు లభించలేదు. తన ఆట కంటే అందం‌తోనే అభిమానులను ఆకట్టుకుంది. సౌతిండియా హీరోయిన్‌లా ఉండే పల్లికల్.. దినేశ్ కార్తీక్‌కు లవ్ మ్యారేజ్ చేసుకుంది. అప్పటికే స్నేహితుడు, మొదటి భార్య చేతిలో దారుణంగా మోసపోయి దేవదాస్‌లా మారిన కార్తీక్‌ను మళ్లీ మాములు మనిషిని చేసింది.

 కార్తీక్‌‌కు అండగా..

కార్తీక్‌‌కు అండగా..

ప్రస్తుతం టీమిండియాలోకి దినేశ్ కార్తీక్ రీఎంట్రీ ఇవ్వడానికి కూడా ఆమెనే ప్రధాన కారణం. మొదటి భార్య, స్నేహితుడి దారుణ మోసం అనంతరం మళ్లీ ట్రైనింగ్ ప్రారంభించిన కార్తీక్‌కు పల్లికల్ జిమ్‌లో పరిచయమైంది. అతని గురించి తెలుసుకొని చలించిపోయిన పల్లికల్.. డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు కోచ్‌తో కలసి కార్తీక్‌‌కు సాయం చేసింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. నవంబర్ 2013లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న దీపికా, దినేశ్ కార్తీక్... ఆగస్టు 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి క్రిస్టియన్‌, హిందూ పద్ధతుల్లో అంగరంగ వైభవంగా సాగింది. 2012లో అర్జున అవార్డు, 2014లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.

 తొలి స్క్వాష్ ప్లేయర్‌గా..

తొలి స్క్వాష్ ప్లేయర్‌గా..

ఈ క్రమంలో అర్జున అవార్డు అందుకున్న తొలి స్క్వాష్ ప్లేయర్‌గా దీపికా పల్లికల్ చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు ఆసియా గేమ్స్‌లో సైతం దీపికా పల్లికల్ అనేక పతకాలను సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌ 2018లో స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని కోల్పోయిన నేపథ్యంలో పల్లికల్ అంఫైర్ నిర్ణయాన్ని నిలదీసింది. చెన్నైలోని ఎథిరాజ్‌ ఉమెన్స్‌ కాలేజీలో ఇంగ్లిష్‌ ఆనర్స్‌లో బీఏ పట్టా పొందిన పల్లికల్... ప్రపంచ టాప్‌-10 స్క్వాష్‌ మహిళా ప్లేయర్ల జాబితాలో స్థానం దక్కించుకున్న తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

స్క్వాష్‌లో దీపికా పల్లికల్ సాధించిన విజయాలు..

స్క్వాష్‌లో దీపికా పల్లికల్ సాధించిన విజయాలు..

గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2014లో మహిళల డబుల్స్‌లో స్వర్ణం

గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2018లో మహిళల డబుల్స్‌లో రజత పతకం

మిక్స్‌డ్ డబుల్స్‌లో కామన్వెల్త్ గేమ్స్ 2018లో రజత పతకం

ఆసియా గేమ్స్ 2014లో భారత మహిళా జట్టులో రజత పతకం.

ఆసియా గేమ్స్ 2014లో మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం

జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్ 2018లో మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్‌డబుల్స్‌‌లో కాంస్యం..

Story first published: Tuesday, August 9, 2022, 14:33 [IST]
Other articles published on Aug 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+