కరోనాతో జపాన్ సుమో రెజ్లర్ మృతి

టోక్యో: జపాన్‌కు చెందిన 28 ఏళ్ల సుమో రెజ్లర్.. కరోనా వైరస్‌తో ప్రాణాలు విడిచాడు. ఈ మహమ్మారి భారిన పడి సుమో రెజ్లర్ చనిపోవడం ఇదే తొలి ఘటన. జపాన్ సుమో అసోసియేషన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. రెజ్లర్ షోబుషి అసలు పేరు కియోటకా సుటేకా కాగా.. అతనికి కరోనా వైరస్ సోకడంతో నెలరోజులు క్రితం ఆసుపత్రిలో చేరాడు.
వైరస్‌తో పోరాడిన అతను ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోయాడని జపాన్ మీడియా పేర్కొంది. 2007లో షోబుషి ప్రొఫెషనల్ సుమో పోటీల్లో పాల్గొన్నాడు. కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్‌లో అతను 11వ స్థానంలో నిలిచాడు. ఏప్రిల్‌లో అయిదుగురు సుమో రెజ్లరకు వైరస్ సంక్రమించినట్లు ఆ సంఘం పేర్కొన్నది. మహమ్మారి వల్ల మే 24వ తేదీ నుంచి టోక్యోలో జరిగాల్సిన సుమో రెజ్లింగ్ పోటీలను కూడా వాయిదా వేశారు. జపాన్‌లో ఇప్పటి వరకు 16,759 మందికి వైరస్ సంక్రమించగా.. 691 మంది మరణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications