ట్రైనర్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువ మహిళా వెయిట్ లిఫ్టర్ మృతి చెందింది. ఈ అనూహ్య ఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటన యావత్ క్రీడా లోకాన్ని కలవరపాటుకు గురి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బికనీర్‌కు చెందిన యష్తికా ఆచార్య అనే 17 ఎళ్ల అమ్మాయి.. వెయిట్ లిఫ్టర్‌గా కెరీర్‌ను ఎంచుకుంది. జూనియర్ నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు రేపింది. విశ్వక్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి పతకాలు సాధించాలని కలలు కన్నది.
ఆమె ప్రతిభను చూసిన జనాలు కూడా గొప్ప వెయిట్ లిఫ్టర్ అవుతుందని భావించారు. కానీ ట్రైనర్ నిర్లక్ష్యం ఆమె ప్రాణాలను బలిగొన్నది. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్‌గా ఎదగాలనుకున్న ఆ టీనేజర్ ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. యష్తికా జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తూ ట్రైనర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. రోజువారి ప్రాక్టీస్‌లో భాగంగా 270 కిలోల బరువు ఎత్తే ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోవడంతో స్క్వౌట్ రాడ్ జారి ఆమె మెడపై పడింది. దాంతో ఆమె మెడలు విరిగి ప్రాణాలను కోల్పోయింది. ఆమె వెనకాలే ట్రైనర్, పక్కనే ఇతర లిఫ్టర్లు ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు ట్రైనర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. యష్తికా మరణానికి అతనే కారణమని మండిపడుతున్నారు. యష్తికా అకాల మరణంపై క్రీడా ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం, నైపుణ్యం కలిగిన ట్రైనర్ల వద్దే శిక్షణ తీసుకోవాలని సూచిస్తున్నారు.
⚠️ Disturbing Visual ⚠️
— Sachin Gupta (@SachinGuptaUP) February 19, 2025
राजस्थान : बीकानेर में पावरलिफ्टर याष्टिका आचार्य (उम्र 17 साल) की जिम में मौत हो गई। 270 किलो वजन उठाते वक्त रॉड गिरने से गर्दन की हड्डी टूट गई। pic.twitter.com/REt23agjwa