For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రన్నింగ్ రేస్‌లో స్వర్ణం గెలిచిన 106 ఏళ్ల బామ్మ!

106 years old woman wins gold medal in 100m Running Race at National Open Masters Athletics Championships

వదోదర: 30 ఏళ్లకే బారెడు పొట్ట వేసుకొని నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఓ బామ్మ అద్బుతం చేసింది. 106 ఏళ్ల వయసులో అత్యంత ఫిట్‌గా ఉన్న ఆమె.. ఏకంగా 100 మీటర్ల రన్నింగ్ రేసులో స్వర్ణం పతకం గెలిచింది. ఆ బామ్మ పేరు రమా బాయ్. ప్రస్తుతం క్రీడావర్గాల్లో ఆమె పేరు చర్చనీయాంశమైంది. యావత్ దేశం ఆమెకు జేజేలు పలుకుతోంది. ఆమె ఫిట్‌నెస్‌ను చూసి యువకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

జాతీయ వెటరన్‌ అథ్లెటిక్స్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగులో పోటీ పడిన రమా బాయ్ స్వర్ణం గెలిచి ఔరా అనిపించింది. ఎలాంటి వయసు నిబంధన లేని ఈ రేసులో ఏమాత్రం తడబడకుండా పరుగెత్తిన ఈ హరియాణా అథ్లెట్‌ అందరికంటే ముందు పరుగు పూర్తి చేసింది.

ఇదే పోటీల్లో 82 ఏళ్ల జగదీష్‌ శర్మ 100 మీటర్ల పరుగులో రెండో స్థానంలో నిలిచాడు. 3 వేల మీటర్ల రేసులో రమాబాయ్‌ మనమరాలు షర్మిలా సాంగ్వాన్‌ కాంస్యం గెలిచింది. గత పన్నెండు నెలలుగా రమాబాయ్‌ పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంటోంది.

Story first published: Saturday, June 18, 2022, 11:29 [IST]
Other articles published on Jun 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+