Ultimate Kho Kho:సరికొత్త ఫార్మాట్‌తో కేక పుట్టిస్తున్న మన స్కూల్ గేమ్.. క్రికెట్‌కు మించిన ఎక్సైట్‌మెంట్!

హైదరాబాద్: ఐపీఎల్, ఐఎస్‌ఎల్, ప్రోకబడ్డీ, బ్యాడ్మింటన్ లీగ్ తరహాలోనే మరో భారత సంప్రదాయం క్రీడా ఫ్రాంచైజీ లీగ్‌తో మన ముందుకొచ్చింది. మనం స్కూళ్లో ఆడిన ఆట సరికొత్త హంగులతో రూపొదిద్దుకొని మన టీవీలో మన భాషలో అలరిస్తోంది. ఐపీఎల్, ప్రోకబడ్డీ తరహాలో ప్రేక్షకాదరణ అందుకునే విధంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే 50 శాతం లీగ్ పూర్తవ్వగా.. మొత్తం 6 జట్లు అరంగేట్ర సీజన్ టైటిల్ కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. తెలుగు యోధాస్, ముంబై ఖిలాడీస్, చెన్నై క్విక్ గన్స్, గుజరాత్ జెయింట్స్, రాజస్థాన్ వారియర్స్, ఒడిశా జాగర్‌నట్స్ జట్లు అభిమానగణాన్ని సంపాదించుకున్నాయి.

లీగ్ ఫార్మాట్..
ఐపీఎల్ తరహాలోనే ప్రతీ జట్టు తమ ప్రత్యర్థి జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది.ఈ లెక్కన మొత్తం 30 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశ ముగిసేసరికి టాప్-4లో ఉన్న నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. టాప్-2 టీమ్స్ క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఆడగా.. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతోంది. ఓడిన జట్టు మాత్రం మూడు, నాలుగోస్థానాల్లో నిలిచిన జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్ 2 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు టైటిల్ ఫైట్ బరిలోకి దిగుతోంది. ఫార్మాట్ మొత్తం ఐపీఎల్ తరహాలోనే జరగనుంది.

ఆటలో మార్పులు..
అభిమానుల్లో ఆసక్తిని పెంచేందుకు ఖోఖో ఆటలో స్వల్ప మార్పులు చేశారు. మ్యాచ్‌లు మరింత ఉత్సాహంగా సాగేలా నిబంధనలు మార్చారు. ప్రతీ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లతో పాటు ఏడేసి నిమిషాలతో కూడిన రెండు టర్న్స్ ఉంటాయి. సంప్రదాయ ఖోఖోలో ఈ టైమ్ 9 నిమిషాలుగా ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ టర్న్‌కు రెండు నిమిషాలు, ఇన్నింగ్స్ మధ్య ఐదు నిమిషాల బ్రేక్ ఉంటుంది. పాత రూల్స్ ప్రకారం టర్న్ మధ్య ఐదు, ఇన్నింగ్స్ మధ్య 6 నిమిషాల బ్రేక్ ఉండేది. మ్యాట్ సైజ్‌లో కూడా మార్పులు చేశారు.

పాయింట్స్ విధానంలో మార్పులు..
ఇక పాయింట్స్ విధానంలో కూడా మార్పులు చేశారు. టచ్ చేసిన ప్రతీసారి రెండు పాయింట్లు వస్తాయి. పాత రూల్స్ ప్రకారం ఒక్క పాయింట్ మాత్రమే వచ్చేది. అంతేకాకుండా బోనస్ పాయింట్ కూడా లభిస్తుంది. డిఫెండర్‌ను పోల్ డైవ్, స్కై డైవ్, లొంగిపోయేలా చేసినా అటాకర్‌కు బోనస్ పాయింట్ లభిస్తుంది. ఇక డిఫెండర్ టీమ్‌లో ఒక బ్యాచ్(ముగ్గురు సభ్యులతో) 2 నిమిషాల 30 సెకండ్ల ఔటవ్వకుండా ఉంటే రెండు పాయింట్లు లభిస్తాయి. ఆ తర్వాత ఔటవ్వకుండా ఉన్న ప్రతీ 30 సెకండ్లకు రెండు పాయింట్లు లభిస్తాయి.

పవర్ ప్లే, వాజీర్..
ఖో ఖో గేమ్‌లో పవర్ ప్లే, వాజీర్ అనే నిబంధనలను ఉంటాయి. వాజీర్ యాక్టీవ్ అయిన అటాకర్ మైదానంలో ఏ దిశలోనైనా పరుగెత్తవచ్చు. పవర్ ప్లే యాక్టీవ్‌లో ఉన్నప్పుడు జట్టులో ఇద్దరు వాజీర్స్ ఉంటారు. ఒక బ్యాచ్ ఔటయ్యే వరకు ఇది అమల్లో ఉంటుంది. క్రికెట్‌లో పవర్ ప్లేలో ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉన్నట్లు ఇక్కడ అటాకింగ్ టీమ్‌కు ఇది అడ్వాంటేజ్‌గా ఉంటుంది. ఇరు జట్లకు ఇన్నింగ్స్‌కు ఒక పవర్ ప్లే ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications