Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pro Kabaddi League: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లానే తెలుగు టైటాన్స్‌.. పదోసారి ఓటమి!

Telugu Titans Follow Sunrisers Hyderabad By Losing 10 Games In Pro Kabaddi League

హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ.. ప్రొకబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్.. మూడు జట్లది ఒకే పరిస్థితి. వరుస ఓటములతో తెలుగు రాష్ట్రాల అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్‌లో దారుణమైన ప్రదర్శన కనబర్చిన సన్‌రైజర్స్.. 14 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. తాజాగా జరుగుతున్న ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ కాస్త మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ.. గత సీజన్లలో దారుణమైన ప్రదర్శన కనబర్చింది.

ఇక బెంగళూరు వేదికగా జరుగుతున్న ప్రొకబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 31-36తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడిపోయింది. తెలుగు టీమ్‌లో అంకిత్(7), రాకేశ్ గౌడ(5), ఆకాశ్(5) రాణించినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ పవన్ షెరావత్(12 పాయింట్లు) మరో సూపర్ 10తో బెంగళూరు బుల్స్‌ను గెలిపించాడు. ఆరంభం నుంచే బెంగళూరు బుల్స్ ఆధిపత్యం చెలాయించింది. సూపర్ రైడింగ్‌తో పాటు అద్భుత ట్యాకిల్స్‌తో తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేసి ఫస్టాఫ్‌లొ 22-11 తేడాతో డబుల్ లీడ్ సాధించింది.

సెకండాఫ్‌లో తెలుగు టైటాన్స్ నేలకు కొట్టిన బంతిలా పుంజుకున్నా.. విజయాన్ని అందుకోలేకపోయింది. ట్యాకిలింగ్‌లో సత్తా చాటిన తెలుగు టైటాన్స్‌ బెంగళూరు ఓసారి ఆలౌట్ చేసి సెకండాఫ్‌లో 20 పాయింట్లు సాధించింది. మరోవైపు బెంగళూరు 14 పాయింట్లే సాధించినా.. ఫస్టాఫ్ లీడ్ ఆ జట్టు విజయానికి కలిసొచ్చింది.

ఇక మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 36-35తో యూపీ యోధాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. హర్యానా స్టీలర్స్‌లో ఆల్‌రౌండర్ రోహిత్ గులియా ఏడు పాయింట్లు సాధించగా.. వినయ్, మోహిత్, జయదీప్, వికాస్ కండోలా ఐదేసి పాయింట్లతో సత్తా చాటారు. మరోపు యూపీ యోధాలో శ్రీకాంత్ జాదవ్ సూపర్ 10తో చెలరేగగా.. స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 6 పాయింట్లు సాధించాడు. ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫస్టాఫ్‌లో హర్యానా 15-14తో సాధించిన ఒక్కపాయింట్ లీడ్ ఆ జట్టుకు కలిసొచ్చింది.

Story first published: Monday, January 24, 2022, 9:56 [IST]
Other articles published on Jan 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+