తలైవాస్‌ను చిత్తుగా ఓడించిన తెలుగు టైటాన్స్


న్యూ ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో విజయం కోసం ఎదురుచూస్తున్న తెలుగు టైటాన్స్ తమ నాలుగో సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న తొలి టైటిల్ పోరాటాన్ని ఘనంగా ఆరంభించింది. ఆరంభం నుంచి ఆధిక్యం చూపించి తలైవాస్‌పై విజయం సాధించింది. స్టార్ రైడర్ రాహుల్ సహాయంతో జట్టు విజయాన్ని ఖరారు చేసుకుంది.

రాహుల్, అజయ్ 9 రైడ్ పాయింట్లతో
టైటాన్స్ నుంచి రాహుల్ చౌధరి, తలైవాస్ నుంచి అజయ్ ఠాకూర్ తొమ్మిదేసి రైడ్ పాయింట్లతో టాప్‌లో నిలిచారు. జోన్‘బి'లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (9 పాయింట్లు), మోసిన్ (7 పాయింట్లు), నీలేశ్ సోలంకి (5 పాయింట్లు) చెలరేగి ఆడారు.
'కోహ్లీ తప్ప ఎంటర్‌టైనర్సే కనిపించడం లేదు'

తలైవాస్‌తో మ్యాచ్‌లో 33-28 తేడాతో
మంగళవారం తమిళ్ తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 33-28 తేడాతో విజయం సాధించింది. ఆట ఆరంభమైన తొలి పది నిమిషాలు ఇరు జట్లు హోరాహారీగా తలపడినా ఆ తర్వాత రాహుల్ చౌదరి ధాటిగా ఆడటంతో తమిళ్ తలైవాస్ జట్టు ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభంలో తలైవాస్ దూకుడు కనబరిచి పైచేయి సాధించింది. అయితే ప్రథమార్ధం చివరి ఐదు నిమిషాల్లో 10-9తో ఆధిక్యం సాధించిన టైటాన్స్ ఆ తర్వాత తలైవాస్‌ను ఏ దశలోనూ కోలుకోనీయలేదు.

టైటాన్స్ ఏ దశలోనూ వెనకబడలేదు
అదే జోరుతో ఫస్టాఫ్‌ను 17-11 తేడాతో ముగించింది. కానీ మంజీత్ చిల్లర్‌తో పాటు అజయ్ ఠాకూర్ విజృంభించడంతో తలైవాస్ 20-24తో టైటాన్స్‌ను సమీపించింది. అటు రాహుల్ చౌదరి రైడ్‌కు వెళ్లిన దాదాపు ప్రతిసారి పాయింట్ తేవడంతో టైటాన్స్ ఏ దశలోనూ వెనకబడలేదు. ఆ తర్వాత కూడా టైటాన్స్‌కు ఎలాంటి పోటీ ఎదురుకాకపోవడంతో చకచకా పాయింట్లను పెంచుకుంటూ వెళ్లింది.

అద్భుత రైడింగ్‌తో సంపూర్ణ ఆధిక్యం
రెండో అర్ధభాగంలో తలైవాస్ పుంజుకొని పోటీనిచ్చినా లాభం లేకపోయింది. తమిళ్ తలైవాస్ తరఫున కెప్టెన్ అజయ్ ఠాకూర్ 9 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్‌లో అమిత్ (6 పాయింట్లు) సత్తా చాటాడు. పటిష్ఠమైన డిఫెన్స్‌కు తోడు అద్భుత రైడింగ్‌తో సంపూర్ణ ఆధిక్యం చూపడంతో టైటాన్స్‌పై తలైవాస్ ఆటగాళ్లు ప్రభావం చూపలేకపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications