Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'కోహ్లీ తప్ప ఎంటర్‌టైనర్సే కనిపించడం లేదు'

Apart from Virat Kohli, Struggle To See Entertainers In Cricket Says Kevin Pietersen | Oneindia
Apart from Virat Kohli, struggle to see entertainers in cricket, says Kevin Pietersen

న్యూ ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఏదో ఒక విషయంలో ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత క్రికెటర్లలో వినోదం పంచుతున్న వారు చాలా తక్కుగా ఉన్నారని ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. ఇప్పుడు ఎంటర్‌టైనర్స్‌ను చూసేందుకు ఇబ్బంది పడుతున్నానని పేర్కొన్నారు. వారిలో అసలైన ఆట కనిపించడం లేదని పెదవి విరిచారు. కానీ, ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి మాత్రం మినహాయింపు ఇస్తానని పీటర్సన్‌ అన్నాడు.

 బీసీసీఐ రేడియోతో ముచ్చటించిన పీటర్సన్:

బీసీసీఐ రేడియోతో ముచ్చటించిన పీటర్సన్:

విరాట్‌ కోహ్లీని మినహాయిస్తే క్రికెట్‌లో వినోదాన్ని పంచేవారు, సూపర్‌ స్టార్లు కనిపించడమే లేదు. ఈ విషయం నన్ను ఆందోళన పరుస్తోందని పీటర్సన్‌ బీసీసీఐ రేడియోతో ముచ్చటించాడు. ఒకప్పటి సూపర్‌ స్టార్లు ముత్తయ్య మురళీధరన్‌, కోర్ట్లీ ఆంబ్రోస్‌, కోర్ట్నీ వాల్స్‌, మాథ్యూ హెడేన్‌, సచిన్‌ టెండూల్కర్‌, రికీ పాంటింగ్‌, షేన్‌ వార్న్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌, వసీమ్‌ అక్రమ్‌ను ఈ తరం క్రికెటర్లతో ఆయన పోల్చారు.

రంజీల్లో అదరగొట్టి టీమిండియాలో స్థానం పొందలేకపోయిన ముగ్గురు క్రికెటర్లు వీరే

 బహుశా ఇది తరం మారడం వల్ల కావొచ్చా

బహుశా ఇది తరం మారడం వల్ల కావొచ్చా

బహుశా ఇది ఒక తరం మారడం వల్ల కావొచ్చేమో! ఒకప్పటి తారల్లో కొందరు ప్రస్తుతం వ్యాఖ్యాతలుగా చేస్తున్నారు. దురదృష్టకరం ఏమిటంటే వారంతా క్రికెట్‌లో లేరు. ఆ సూపర్‌ స్టార్లంతా ఫ్రాంచైజీలు, జాతీయ జట్లు, అకాడమీల్లో ఉంటే బాగుంటుంది. అలాగైతే యువతలో ప్రేరణ నింపగలరు'అని పీటర్సన్‌ అన్నాడు.

 కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో

కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో

అత్యధిక సార్లు ఫాలోఆన్‌ ఆడించిన భారత కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకూ ప్రత్యర్థి జట్టును కోహ్లీ ఐదు సార్లు ఫాలోఆన్‌కు ఆహ్వానించగా, మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ ఏడుసార్లు ఫాలో ఆన్‌ ఆడించాడు. దాంతో ఎక్కువ సార్లు ఫాలోఆన్‌ ఆడించిన భారత కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.

వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానంలో కోహ్లీ

వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానంలో కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాలు వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. సోమవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 884 పాయింట్లతో బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 797 పాయింట్లతో బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

Story first published: Wednesday, October 10, 2018, 8:20 [IST]
Other articles published on Oct 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+