తెలుగు టైటాన్స్ ఫ్రాంచైజీ కారణంగానే తన కెరీర్ నాశనమైందని ఆ జట్టు మాజీ ప్లేయర్ రాహుల్ చౌదరి ఆరోపించాడు. వరుసగా ఆరు సీజన్ల పాటు ఆ జట్టుకు ఆడిన తర్వాత కనీస సమాచారం ఇవ్వకుండా జట్టు నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రొకబడ్డీ సీజన్ 11 నేపథ్యంలో జరిగిన వేలంలో రాహుల్ చౌదరికి నిరాశే ఎదురైంది.
వేలంలో అతన్ని కొనడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఆరంభ సీజన్స్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించిన రాహుల్ చౌదరి.. తనదైన రైడింగ్‌తో కబడ్డీ అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రోకబడ్డీ లీగ్ ఆదరణ పెరగడానికి ప్రధాన కారణమయ్యాడు. అలాంటి ఈ సార్ట్ ఆటగాడిని ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. తన పాత ఫ్రాంచైజీ తెలుగు టైటాన్స్ కూడా అతన్ని కనీస ధరకు తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.

రాహుల్ చౌదరితోపాటు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ గులియా, విశాల్ భరద్వాజ్, దీపక్ హుడా, రోహిత్ కుమార్, సురేందర్ నాడా, మోనులు కూడా అన్‌సోల్ట్ ప్లేయర్లుగా మిగిలిపోయారు. వరుసగా ఆరు సీజన్ల పాటు రాహుల్ చౌదరి తెలుగు టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
తొలి సీజన్‌లో రైడర్‌గా దుమ్మురేపిన రాహుల్ చౌదరి, నాలుగో సీజన్‌లో బెస్ట్ రైడర్ అవార్డ్ కూడా అందుకున్నాడు. భుజ గాయానికి గురైనా జట్టులో కొనసాగాడు. తాను అన్‌సోల్డ్‌గా మిగలడంపై రాహుల్ చౌదరి స్పందించాడు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు టైటాన్స్‌కు తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
'తెలుగు టైటాన్స్ జట్టును నా హోమ్ టీమ్‌గా భావించాను. ప్రొకబడ్డీ లీగ్‌లో నేను కొనసాగే వరకు తెలుగు టైటాన్స్‌కే ఆడాలనుకున్నాను. తెలుగు టైటాన్స్ నన్ను రిలీజ్ చేస్తుందని.. నేను వేరే జట్టుకు ఆడుతానని కలలో కూడా అనుకోలేదు. కానీ ఏడో సీజన్‌కు ముందు తెలుగు టైటాన్స్ కనీస సమాచారం ఇవ్వకుండా నన్ను వదిలేసింది. ఆ నిర్ణయం నన్ను షాక్‌కు గురి చేసింది.'అని రాహుల్ చౌదరి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తమిళ్ తలైవాస్, పుణేరి పల్టాన్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లకు ఆడినా.. సరైన కాంబినేషన్ లేక మునపటిలా సత్తా చాటలేకపోయాడు.
గత సీజన్‌లో అయితే అతను తుది జట్టులో చోటు కూడా దక్కించుకోలేకపోయాడు. కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. దాంతో అతన్ని ఆ జట్టు వదిలేయగా.. ఈ సారి వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.