PKL 2019: ఢిల్లీలో పుణెరి పల్టన్ జోరు కొనసాగేనా?

హైదరాబాద్: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో భాగంగా చెన్నై అంచె ముగిసింది. లీగ్‌లో భాగంగా సోమవారం అనుప్ కుమార్ నాయకత్వంలోని పుణెరి పల్టన్ యుపి యోధ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అతిథ్యమివ్వనుంది.
గత మ్యాచ్‌లో విజయం సాధించిన ఉత్సాహాంతో పుణెరి పల్టన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుండగా... యుపి యోధ మాత్రం టేబుల్ టాపర్ దబాంగ్ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ని యుపి యోధ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

పది మ్యాచ్‌లు ఆడిన యుపి యోధ
ఈ సీజన్‌లో ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన యుపి యోధ మూడింట విజయం సాధించి 22 పాయింట్లతో పట్టికలో పదో స్థానంలో కొనసాగుతుండగా... మరోవైపు పుణెరి పల్టన్ సైతం మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 19 పాయింట్లతో పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతుంది.
'అతడి మైండ్ దొబ్బింది': టిమ్ పైన్ డీఆర్ఎస్ నిర్ణయం వల్లే ఆసీస్ ఓడిందా?

ఆడినవి: 10
గెలిచినవి: 3
టై: 2
ఓటమి: 5
విన్ రేట్: 30%
బెస్ట్ రైడర్: మను గోయత్
బెస్ట్ డిఫెండర్: సుమిత్

పుణెరి పల్టన్ పుంజుకొనేనా?
అనుప్ కుమార్ కోచింగ్ నేతృత్వంలోని పుణెరి పల్టన్ మంచి ఫలితాలను నమోదు చేస్తోంది. రైడింగ్ డిపార్ట్‌మెంట్‌లో పంకజ్ మోహితే అదరగొడుతుంటే... సుర్జిజ్ సింగ్ ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి వస్తున్నాడు. పుణెరి పల్టన్ స్టార్ రైడర్ నితిన్ తోమర్ ఇప్పటివరకు ఆకట్టుకోలేని ప్రదర్శన చేయలేదు. అయితే, అడపాదడపా జట్టుకు విజయాలందిస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తుని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.

పుణెరి పల్టన్
ఆడినవి: 9
గెలిచినవి: 3
టై: 1
ఓడినవి: 5
విన్ రేట్: 33.33%
బెస్ట్ రైడర్: పంకజ్ మొహితే
బెస్ట్ డిఫెండర్: సుర్జిత్ సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications