For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2019: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్, ఈ సీజన్‌లో ఆరో ఓటమి

Pro Kabaddi 2019 : Puneri Paltan Defeated Telugu Titans 27-34 In PKL || Oneindia Telugu
Puneri Paltan defeat Telugu Titans to move above them in the league’s standings


హైదరాబాద్:
ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఆరో ఓటమిని మూటగట్టుకుంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఓ టైతో గాడిన పడినట్లే కనిపించిన తెలుగు టైటాన్స్‌కు పుణేరీ పల్టన్ బ్రేకులు వేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 27-34తో పుణేరీ పల్టన్ చేతిలో ఓటమి పాలైంది.

ఒకానొక దశలో ఆధిక్యంలో నిలిచి తెలుగు టైటాన్స్ ఆ తర్వాత పట్టు విడిచిన ఈ సీజన్‌లో ఆరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ట్యాక్లింగ్‌లో డిఫెండర్లు సత్తాచాటినప్పటికీ.. కీలక సమయాల్లో రైడర్లు చేతులెత్తేయడంతో తెలుగు టైటాన్స్‌కు జట్టుకు ఓటమి తప్పలేదు.

12 రైడ్లలో 7 పాయింట్లు సాధించిన సిద్ధార్థ్ దేశాయ్

12 రైడ్లలో 7 పాయింట్లు సాధించిన సిద్ధార్థ్ దేశాయ్

స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 12 రైడ్లలో 7 పాయింట్లు సాధించగా.. ట్యాక్లింగ్‌లో అరుణ్ (6 పాయింట్లు), విశాల్ (5 పాయింట్లు) రాణించారు. పల్టన్స్ తరఫున మన్‌జీత్ (9 పాయింట్లు), నితిన్ తోమర్ (8 పాయింట్లు) ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌‌ను తెలుగు టైటాన్స్ చాలా పేలవంగా మొదలెట్టింది.

సిద్ధార్థ్ దేశాయ్

సిద్ధార్థ్ దేశాయ్

మ్యాచ్ తొలి రెండు నిమిషాల్లోనే టైటాన్స్ 0-5తో వెనుకబడింది. విశాల్‌ సూపర్‌ ట్యాకిల్‌తో పుంజుకున్న టైటాన్స్‌.. ప్రత్యర్థిని అందుకోవడమే కాకుండా 16 నిమిషాలు ముగిసేసరికి 13-10తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కొద్దిసేపటికే

అరుణ్ సూపర్ ట్యాకిల్‌తో తెలుగు టైటాన్స్‌ను ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు.

అతడే సమయమిచ్చాడు: ధోనీని ఎంపిక చేయకపోవడం వెనుక కొత్త ట్విస్ట్!

14-17తో వెనుక బడిన తెలుగు టైటాన్స్

14-17తో వెనుక బడిన తెలుగు టైటాన్స్

కానీ ఆధిక్యాన్ని నిలుపుకోవడంలో విఫలమైంది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి తెలుగు టైటాన్స్ 14-17తో నిలిచింది. రెండో అర్ధభాగంలో దూకుడుగా ఆడిన టైటాన్స్‌ 19-21తో ప్రత్యర్థికి సమీపంగా వెళ్లగలిగింది. వెంటనే మంజీత్‌ (9) సూపర్‌ రైడ్‌తో పుణెరి 25-19తో పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది.

ఆకట్టుకున్న నితిన్ తోమర్

ఆకట్టుకున్న నితిన్ తోమర్

మరో రెండు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా 25-33తో వెనకబడి ఓటమి ఖరారు చేసుకుంది. ఇక అక్కడి నుంచి ఆధిక్యాన్ని కొనసాగించుకుంటూ వచ్చిన పల్టన్ చివరకు 34-27తో మ్యాచ్‌ను తమ ఖాతాలో వేసుకుంది. పుణెరి తరపున మంజీత్‌తో పాటు నితిన్‌ తోమర్‌ (8) ఆకట్టుకున్నాడు.

24 పాయింట్లతో రెండోస్థానంలో

24 పాయింట్లతో రెండోస్థానంలో

ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట్లో మాత్రమే గెలిచిన తెలుగు టైటాన్స్‌ 24 పాయింట్లతో పట్టికలో చివరి నుంచి రెండోస్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 38-35 తేడాతో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో నవీన్‌ కుమార్‌ (16) రైడింగ్‌లో సత్తాచాటాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం

ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం

బెంగళూరు బుల్స్‌ vs గుజరాత్‌ ఫార్చ్యూన్‌జెయింట్స్‌ (రాత్రి 7:30 నుంచి)

యు ముంబా vs జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ (రాత్రి 8:30 నుంచి)

Story first published: Saturday, August 31, 2019, 8:18 [IST]
Other articles published on Aug 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+