Pro Kabaddi League: తమిళ్ తలైవాస్‌కు తప్పని ఓటమి.. హర్యానాను ఓడించిన జైపూర్!

బెంగళూరు: ప్రొకబడ్డీ లీగ్ సీజన్-9లో తమిళ్ తలైవాస్‌కు మరో ఓటమి ఎదురైంది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో తమిళ్‌తలైవాస్ 32-39 తేడాతో యు ముంబా చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ ఆరంభం నుంచి హోరాహోరీగా ఇరు జట్లు తలపడ్డాయి. వాస్తవానికి ఫస్టాఫ్ ముగిసే సమయానికి 16-15తో తమిళ్ తలైవాస్ పై చేయి సాధించింది. అయితే సెకండాఫ్‌లో యు ముంబా పుంజుకోగా.. తమిళ్ తలైవాస్ రైడింగ్‌లో తడబడింది. దాంతో ఏడు పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది.
సెకండాఫ్‌లో తమిళ్ తలైవాస్ 10 రైడింగ్ పాయింట్స్ సాధిస్తే యు ముంబా 15 పాయింట్లు సాధించింది. రెండు సార్లు ఆలౌటవ్వడం కూడా తమిళ్ తలైవాస్ కొంపముంచింది. యు ముంబా తరఫున రైడర్స్, గుమన్ సింగ్(12), ఆశిష్ (10), జై భగవాన్(8) సత్తా చాటారు. తమిళ్ తలైవాస్ తరఫున నరేందర్ ఒక్కడే 15 పాయింట్లు తీసుకురాగా.. ఇతర రైడర్లు విఫలమయ్యారు. యు ముంబాకు ఇది రెండో విజయం కాగా.. తమిళ్ తలైవాస్‌కు రెండో ఓటమి.
హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో జైపూర్ 44-31 తేడాతో హర్యానా స్టీలర్స్‌కు షాకిచ్చింది. ఈ సీజన్‌లో హర్యానాకు ఇదే తొలి పరాజయం. స్టార్ రైడర్ అర్జున్ దేశ్‌వాల్(14), డిఫెండర్ సునీల్ కుమార్(8) జైపూర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. హర్యానా తరఫున రైడర్ మీటూ(16) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇతర ఆటగాళ్లు విఫలమవ్వడంతో హర్యానాకు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఆరంభం నుంచే జైపూర్ పింక్ పాంథర్స్ జోరు కనబర్చింది.
ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాంచిన ఆ జట్టు.. చివరి వరకు అదే ఆధిక్యాన్ని కాపాడుకొని భారీ విజయాన్నందుకుంది. ఫస్టాఫ్ ముగిసే సరికి జైపూర్ 20-12 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లోహర్యానా పుంజుకున్నా.. జైపూర్ ఆటగాళ్లు అవకాశం ఇవ్వలేదు. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో హర్యానాను అడ్డుకున్నారు. దాంతో ఆ జట్టు విజయాన్నందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications