
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. సోమవారం తమిళ్ తలైవాస్, యు ముంబా మధ్య జరిగిన మ్యాచ్ 30-30తో టై అయింది. యు ముంబా స్టార్ రైడర్ అజిత్ అత్యుత్సాహం ఆ జట్టు విజయాన్ని దూరం చేసింది. ఆఖరి రైడ్‌కు వెళ్లిన అజిత్‌ను తమిళ్ తలైవాస్ పట్టేయడంతో స్కోర్లు సమమయ్యాయి. ఈ రైడ్‌కు వెళ్లిన అజిత్ పాయింట్ తేకుండా టైంపాస్ చేసినా ఒక్క పాయింట్‌తో యు ముంబా విజయం సాధించేది.
అయితే మ్యాచ్‌లో యు ముంబా ఈ స్థాయిలో పోటీ ఇచ్చిందంటే దానికి కారణం అజితే. అతను ఏకండా 15 రైడింగ్ పాయింట్స్‌తో జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. అతనికి తోడుగా స్టార్ రైడర్ ఫజెల్ అట్రాచలి ఏడు ట్యాకిల్ పాయింట్స్ సాధించగా.. రింకూ మరో రెండు పాయింట్స్ సాధించాడు. తమిళ్ తలైవాస్‌లో మంజీత్ 8 రైడింగ్ పాయింట్స్ తేగా.. డిఫెండర్ సుర్జీత్ సింగ్ మూడు పాయింట్లు సాధించాడు. ఇక గేమ్ 40వ నిమిషంలో రైడింగ్ వచ్చిన అజిత్‌ను చాకచక్యంగా పట్టేసిన మోహిత్.. జట్టుకు ఓటమిని తప్పించాడు.
వాస్తవానికి మ్యాచ్ ఆరంభంలో తమిళ్ తలైవాసే దూకుడు కనబర్చింది. వరుస పాయింట్లతో ఆధిపత్యం చెలాయించింది. యు ముంబాను ఆరంభంలోనే ఆలౌట్ చేసి భారీ లీడ్ సాధించింది. అనంతరం యు ముంబా నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంది. అజిత్ సూపర్ రైడింగ్‌తో సత్తా చాటాడు. సూపర్ రైడ్‌తో అజిత్ ఒకేసారి నలుగురిని ఔట్ చేయడంతో తమిళ్ తలైవాస్ ఆలౌటైంది. దాంతో ఫస్టాఫ్‌ను యు ముంబా 14-17తో ముగించింది. ఇక మూడు పాయింట్ల లీడ్‌తో సెకండాఫ్ ప్రారంభించిన తమిళ్ తలైవాస్ ఆరంభంలో దూకుడు కనబర్చింది. కానీ ఆ తర్వాత యు ముంబా దూకుడు కనబర్చడంతో లీడ్‌ను కోల్పోయింది. అజిత్ సూపర్ రైడింగ్‌తో ఆలౌటైన తమిళ్ తలైవాస్.. చివర్లో పుంజుకుంది. చివరి రైడ్‌కు ముందు 29-30తో వెనుకంజలో ఉన్న తమిళ్ తలైవాస్.. అజిత్‌ను పట్టేసి మ్యాచ్‌ను కాపాడుకుంది.