
ఫిబ్రవరి 26న ఫైనల్..
లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్-6లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఫైనల్‌తో ఎనిమిదో సీజన్ ముగుస్తుంది. తొలి రెండు మ్యాచ్‌లు వరుసగా రాత్రి గం. 7:30 నుంచి... గం. 8:30 నుంచి మొదలవుతాయి. మూడో మ్యాచ్‌లను రాత్రి గం. 9:30 నుంచి నిర్వహిస్తారు. మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారమవుతాయి. పీకేఎల్‌లో మ్యాచ్ గెలిచిన జట్టుకు ఐదు పాయింట్లు లభిస్తాయి. 'టై' అయితే రెండు జట్ల ఖాతాలో మూడు పాయింట్లు చొప్పున చేరుతాయి. ఏడు లేదా అంతకంటే తక్కువ పాయింట్ల తేడాతో ఓడిన జట్టుకు ఒక పాయింట్ ఇస్తారు. ఏడు పాయింట్ల కంటే ఎక్కువ తేడాతో ఓడిన జట్టుకు పాయింట్లేమీ రావు.

పీకేఎల్ బరిలో ఉన్న జట్లు
బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్, యు ముంబా, తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, తమిళ్ తలైవాస్, యూపీ యోధ.

టైటాన్స్ ఈసారైనా..?
తెలుగు టైటాన్స్‌పై ఈ సారి భారీ అంచనాలున్నాయి. తొలి టైటిల్ ముచ్చట తీర్చుకోవడమే టార్గెట్‌గా టైటాన్స్ బలమైన జట్టును రెడీ చేసుకోవడమే ఇందుకు కారణం. 2018లో బెంగళూరు బుల్స్‌ను విజేతగా నిలిపిన స్టార్ రైడర్ రోహిత్ కుమార్‌ను టీమ్‌లోకి తీసుకున్న టైటాన్స్ అతనికే కెప్టెన్సీ అప్పగించింది. పీకేఎల్‌తో పాటు భారత్‌కు ఆడిన రోహిత్ చాలా అనుభవం ఉంది. సూపర్ రైడ్స్‌తో పాటు కోర్టులో చాలా కూల్‌గా ఉంటూ పక్కా ప్లాన్స్ వేయడంలో తను దిట్ట. రోహిత్‌తో పాటు రూ.1.30 కోట్ల భారీ మొత్తాన్నికి రిటైన్ చేసుకున్న మరో టాప్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ పై టైటన్స్ భారీ ఆశలు పెట్టుకుంది. గత సీజన్‌లో ఆకట్టుకోలేకపోయిన సిద్దార్థ్ ఈసారి సత్తాచాటాలని చూస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో మన్‌జీత్, ప్రపంజన్‌తో బలమైన డిఫెన్స్ కలిగిన తలైవాస్ నుంచి టైటాన్స్‌కు పరీక్ష ఎదురుకానుంది.

నేటి మ్యాచ్‌లు..
బెంగళూరు X యు ముంబా- రాత్రి 7.30 గంటలకు
తెలుగు టైటాన్స్ X తమళ్ తలైవాస్- రాత్రి 8.30 గంటలకు
బెంగాల్ X యూపీ యోధా- రాత్రి 9.30 గంటలకు


Click it and Unblock the Notifications
