For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక వారికి కబడ్డీ కబడ్డే..!

ఇంగ్లండ్‌ పర్యటనను విజయంతో ముగించిన టీమిండియాకు మరో 35 రోజుల పాటు ఎలాంటి సిరీస్ లేదు. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ 2025తోనే టీమిండియా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలు పెట్టనుంది. అప్పటి వరకు భారత క్రీడా అభిమానులను అలరించేందుకు కబడ్డీ ప్రీమియర్ లీగ్‌ సిద్దమైంది. ఆగస్ట్ 29 నుంచి వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో 12వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 12వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను నిర్వాహకులు ప్రకటించారు.

వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈసారి పీకేఎల్ నాలుగు వేర్వేరు నగరాల్లో జరగనుంది. వైజాగ్‌తో పాటు జైపూర్, చెన్నై, ఢిల్లీ నగరాలు కబడ్డీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు.

Pro Kabaddi League Season 12 to Begin on August 29 Telugu Titans to Face Tamil Thalaivas in Opener
Photo Credit: PKL

ఈ సారి తెలుగు టైటాన్స్ తమ హోమ్ బేస్‌‌ను హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు మార్చుకుంది. దాంతో హైదరాబాద్‌లో ప్రోకబడ్డీ లీగ్ మ్యాచ్‌లు లేకుండా పోయాయి. ఈ సీజన్‌లో మొత్తం 12 జట్ల మధ్య మొత్తం 137 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆగస్ట్ 29న తమిళ తలైవాస్, తెలుగు టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రోకబడ్డీ లీగ్ 12వ సీజన్‌కు తెరలేవనుంది.


వైజాగ్ మ్యాచ్‌లు (రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం)

ఆగస్టు 29 మ్యాచ్ 1 తెలుగు టైటాన్స్ vs తమిళ్ తలైవాస్
ఆగస్టు 29 మ్యాచ్ 2 బెంగళూరు బుల్స్ vs పుణెరి పల్టన్
ఆగస్టు 30 మ్యాచ్ 3 తెలుగు టైటాన్స్ vs యూపీ యోధాస్
ఆగస్టు 30 మ్యాచ్ 4 యు ముంబా vs గుజరాత్ జెయింట్స్
ఆగస్టు 31 మ్యాచ్ 5 తమిళ్ తలైవాస్ vs యు ముంబా
ఆగస్టు 31 మ్యాచ్ 6 బెంగాల్ వారియర్జ్ vs హర్యానా స్టీలర్స్
సెప్టెంబర్ 1 మ్యాచ్ 7 పట్నా పైరేట్స్ vs యూపీ యోధాస్
సెప్టెంబర్ 1 మ్యాచ్ 8 పుణెరి పల్టన్ vs గుజరాత్ జెయింట్స్
సెప్టెంబర్ 2 మ్యాచ్ 9 దబాంగ్ ఢిల్లీ K.C. vs బెంగళూరు బుల్స్
సెప్టెంబర్ 2 మ్యాచ్ 10 జైపూర్ పింక్ పాంథర్స్ vs పట్నా పైరేట్స్
సెప్టెంబర్ 3 మ్యాచ్ 11 పుణెరి పల్టన్ vs బెంగాల్ వారియర్జ్
సెప్టెంబర్ 3 మ్యాచ్ 12 హర్యానా స్టీలర్స్ vs యు ముంబా
సెప్టెంబర్ 4 మ్యాచ్ 13 జైపూర్ పింక్ పాంథర్స్ vs తెలుగు టైటాన్స్
సెప్టెంబర్ 4 మ్యాచ్ 14 పుణెరి పల్టన్ vs దబాంగ్ ఢిల్లీ K.C.
సెప్టెంబర్ 5 మ్యాచ్ 15 యు ముంబా vs బెంగళూరు బుల్స్
సెప్టెంబర్ 5 మ్యాచ్ 16 హర్యానా స్టీలర్స్ vs యూపీ యోధాస్
సెప్టెంబర్ 6 మ్యాచ్ 17 పట్నా పైరేట్స్ vs బెంగళూరు బుల్స్
సెప్టెంబర్ 6 మ్యాచ్ 18 తమిళ్ తలైవాస్ vs గుజరాత్ జెయింట్స్
సెప్టెంబర్ 7 మ్యాచ్ 19 బెంగాల్ వారియర్జ్ vs తెలుగు టైటాన్స్
సెప్టెంబర్ 7 మ్యాచ్ 20 దబాంగ్ ఢిల్లీ K.C. vs జైపూర్ పింక్ పాంథర్స్
సెప్టెంబర్ 8 మ్యాచ్ 21 హర్యానా స్టీలర్స్ vs బెంగళూరు బుల్స్
సెప్టెంబర్ 8 మ్యాచ్ 22 పుణెరి పల్టన్ vs పట్నా పైరేట్స్
సెప్టెంబర్ 9 మ్యాచ్ 23 దబాంగ్ ఢిల్లీ K.C. vs బెంగాల్ వారియర్జ్
సెప్టెంబర్ 9 మ్యాచ్ 24 గుజరాత్ జెయింట్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్
సెప్టెంబర్ 10 మ్యాచ్ 25 యు ముంబా vs తెలుగు టైటాన్స్

Story first published: Wednesday, August 6, 2025, 14:51 [IST]
Other articles published on Aug 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+