Pro Kabaddi League: ఢిల్లీ, గుజరాత్ శుభారంభం.. హరియాణాకు షాకిచ్చిన పట్నా!

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8 మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో రోజైన గురువారం మూడు మ్యాచ్‌లు అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజానందించాయి. స్టార్ రైడర్ నవీన్ కుమార్ సూపర్-10తో అదరగొట్టడంతో.. దబాంగ్ ఢిల్లీ శుభారంభం చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 41-30తో పుణెరి పల్టన్‌ను చిత్తు చేసింది. నవీన్ మొత్తం 16 రైడింగ్ పాయింట్లతో చెలరేగడంతో మ్యాచ్ ఏకపక్షమైంది. నాలుగు సార్లు పల్టన్‌ను ఆలౌట్ చేసిన ఢిల్లీ ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పుణె తరఫున వెటరన్లు కెప్టెన్ నితిన్ తోమర్, రాహుల్ చౌదరి ఆశించిన రీతిలో రాణించలేక పోయారు. ఆరంభం నుంచే నవీన్ దూకుడు ప్రదర్శించడంతో 10 నిమిషాల ఆటముగిసే సరికి ఢిల్లీ 11-7తో ఆధిక్యంలో నిలిచింది. నవీన్ చాకచక్యంగా పాయింట్లు రాబట్టడంతో 22-15తో బ్రేక్‌కు వెళ్లింది. సెకండా్‌ఫలో కూడా అదే జోరును ప్రదర్శించిన ఢిల్లీ సునాయాసంగా గెలిచింది.

గుజరాత్‌దే విజయం..
మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 34-27తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. గుజరాత్ డిఫెండర్ గిరీష్ మారుతి 7 టాకిల్ పాయింట్లు సాధించగా.. రైడర్లు రాకేష్ నర్వాల్ 7, హెచ్‌ఎస్ రాకేష్ 6 పాయింట్లతో రాణించారు. జైపూర్ రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్-10 సాధించినా తన జట్టును గెలిపించలేక పోయాడు. రైడర్లు జోరు ప్రదర్శించడంతో 10 నిమిషాల ఆట పూర్తయ్యే సరికి గుజరాత్ 13-7తో పైచేయి సాధించింది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిన జెయింట్స్ 18-12తో నిలిచింది.

ఆలౌట్ చేసి..
అయితే, 18వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన దేశ్వాల్.. గుజరాత్‌ను ఆలౌట్ చేయడంతో జైపూర్ 17-18తో మ్యాచ్‌లోకి వచ్చింది. 19-17తో ఫస్టాఫ్‌ను ముగించింది. 37వ నిమిషంలో ఇరుజట్లూ 27-27తో సమంగా నిలవడంతో ఆసక్తి రేగింది. కానీ, చివరి నిమిషాల్లో వ్యూహాత్మకంగా ఆడిన గుజరాత్.. జైపూర్‌ను దెబ్బకొట్టింది. డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన నవీన్‌ను జెయింట్స్ ఆటగాడు రవీంద్ర పహల్ పట్టేయడంతో గుజరాత్ 29-27తో ముందంజ వేసింది. ఆ తర్వాత జైపూర్‌ను ఆలౌట్ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

పట్నా సూపర్ విక్టరీ..
పట్నా పైరేట్స్ 42-39తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. మోనూ గోయత్ 15 పాయింట్లు తీసుకొచ్చాడు. హర్యానాకు వికాస్ ఖండోలా 6, రోహిత్ గులలియా 10, జైదీప్ కుల్దీప్ చెరో ఐదు పాయింట్లు అందించారు. ఇందులో హర్యానా మొదటి అర్ధభాగంలో 4 పాయింట్ల ఆధిక్యాన్ని కొనసాగించింది. కానీ రెండవ సగంలో పట్నా అద్భుతంగా ఆడింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో హర్యానా స్టీలర్స్ 22 పాయింట్లు జోడించగా, పట్నా 18 పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగంలో హర్యానా రైడ్‌ల ద్వారా 13 పాయింట్లు, ట్యాకిల్స్‌తో 7 మరియు ఆల్ అవుట్‌ల నుండి 2 పాయింట్లు సాధించగా.. పట్నా రైడ్‌ల ద్వారా 13 పాయింట్లు, ట్యాకిల్స్ ద్వారా 2 పాయింట్లు మరియు 2 అదనపు పాయింట్లను మాత్రమే జోడించింది. రెండో అర్ధభాగంలో పట్నా 24 పాయింట్లు జోడించగా, హర్యానా జట్టు 17 పాయింట్లు మాత్రమే పొందగలిగింది. చివరి అర్ధభాగంలో పట్నా రైడ్‌ల ద్వారా 15 పాయింట్లు మరియు ట్యాకిల్స్‌తో 7 పాయింట్లు జోడించగా, హర్యానా రైడ్‌లతో 10 పాయింట్లు మరియు ట్యాకిల్స్‌తో 7 పాయింట్లు సాధించింది.

నేటి మ్యాచ్‌లు..
యు ముంబా vs దబాంగ్ ఢిల్లీ
తమిళ్ తలైవాస్ vs బెంగళూరు బుల్స్
బెంగాల్ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications