Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pro Kabaddi League: హోరా హోరీ మ్యాచ్‌లో పాట్నాపై ఢిల్లీ విజయం!

ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 10లో దబాంగ్ ఢిల్లీ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా మరో విజయాన్ని అందుకుంది. ముంబై‌ వేదికగా శుక్రవారం జరిగిన హోరాహోరు పోరులో దబాంగ్ ఢిల్లీ 39-37 తేడాతో పాట్నా పైరేట్స్‌పై ఒక్క పాయింట్ తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ పోరులో దబాంగ్ ఢిల్లీ పై చేయి సాధించింది.

ఫస్టాఫ్‌లో దుమ్మురేపిన దబాంగ్ ఢిల్లీ.. పాట్నాపైరేట్స్‌పై భారీ ఆధిక్యాన్ని అందుకుంది. రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌తో పట్నా ప్లేయర్లను ఉక్కిరి బిక్కిరి చేసిన దబాంగ్ ఢిల్లీ రెండు సార్లు ఆలౌట్ కూడా చేసింది. దాంతో ఫస్టాఫ్ ముగిసేసరికి 26-13తో డబుల్ ఆధిక్యాన్ని అందుకుంది. దాంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగుస్తుందని అంతా భావించారు. కానీ సెకండాఫ్‌లో సీన్ రివర్స్ అయ్యింది.

Pro Kabaddi League: Dabang Delhi Beat Patna Pirates by 38-37

జూలు విధిల్చిన పాట్నా పైరేట్స్.. అదిరిపోయే రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌తో దబాంగ్ ఢిల్లీని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఒకసారి ఆలౌట్ కూడా చేసింది. కానీ చివర్లో దబాంగ్ ఢిల్లీ చాకచక్యంగా వ్యవహరించి ఒక్క పాయింట్ లీడ్ కాపాడుకొని గెలుపొందింది. సెకండాఫ్‌లో పాట్నా పైరేట్స్ 24-12తో ఆధిక్యంలో నిలిచినా ఫస్టాఫ్ వైఫల్యం కారణంగా ఒక్క పాయింట్ తేడాతో ఓటమిపాలైంది.

దబాంగ్ ఢిల్లీ అషు మాలిక్ సూపర్ 10 సాధించగా.. మంజీత్, యోగేష్ ఐదేసి పాయింట్లు రాబట్టారు. పాట్నా పైరేట్స్‌లో సచిన్ సూపర్ 10 సాధించగా.. సుధాకర్ 9, మంజీత్ నాలుగు పాయింట్లతో సత్తా చాటారు.

ఇక పాట్నా పైరేట్స్ 42 సార్లు రైడింగ్ వెళ్లి 22 సార్లు సక్సెస్ అవ్వగా.. దబాంగ్ ఢిల్లీ 43 సార్లు రైడింగ్ వెళ్లి 18 సార్లు సక్సెస్ అయ్యింది. ఇరు జట్లు చెరొకసారి సూపర్ రైడ్ పాయింట్స్ సాధించాయి. ట్యాక్లింగ్‌లో దబాంగ్ ఢిల్లీ 30 ప్రయత్నాల్లో 11 సార్లు సక్సెస్ అవ్వగా.. పాట్నా పైరేట్స్ 25 ప్రయత్నాల్లో ఏడు సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది.

Story first published: Friday, January 5, 2024, 22:04 [IST]
Other articles published on Jan 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+