Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pro kabaddi league: బెంగాల్ బోణీ.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన తమిళ తళైవాస్!

PKL Season 10: ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ తలైవాస్‌కు మరో పరాజయం ఎదురైంది. బెంగళూరులోని కంఠీరవ ఇండోర్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 48-38 తేడాతో తమిళ తలైవాస్‌ను చిత్తు చేసింది. అనేక మలుపులు తిరిగిన ఈ మ్యాచ్‌ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది.

ఫస్టాఫ్‌లో సమష్టి ప్రదర్శన‌తో జోరు కనబర్చిన తమిళ తళైవాస్ 27-21తో ఆధిక్యంలో నిలిచింది. 16 రైడింగ్, 6 ట్యాకిల్ పాయింట్స్‌తో పాటు 4 ఆలౌట్, ఒక బోనస్ పాయింట్ సాధించింది.

Pro kabaddi league: Bengal Warriors Beat Tamil Thalaivas by 48-38

కానీ సెకాండాఫ్‌లో మాత్రం ఆ జట్టు తేలిపోయింది. బెంగాల్ వారియర్స్ జూలు విధల్చడంతో పాటు తమిళ తళైవాస్ అనవసర తప్పిదాలు ఓటమిని శాసించాయి. ఏడు పాయింట్ల ఆధిక్యంతో సెకండాఫ్‌ బరిలో నిలిచిన తమిళ తలైవాస్ కేవలం 11 పాయింట్లు మాత్రమే సాధించింది. డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోయింది.

ఈ మ్యాచ్‌లో మొత్తం 43 సార్లు రైడింగ్ వెళ్లిన తమిళ తలైవాస్.. 15 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది. మరోవైపు బెంగాల్ వారియర్స్ 43 రైడ్లలో 19 సార్లు సక్సెస్ అవ్వడంతో పాటు రెండు సూపర్ రైడ్స్ పాయింట్స్ సాధించింది. ట్యాక్లింగ్‌లోనూ తమిళ తళైవాస్ తడబడింది. 28 ప్రయత్నాల్లో 10 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది.

మరోవైపు బెంగాల్ మాత్రం 29 ప్రయత్నాల్లో 13 సార్లు సక్సెస్ సాధించింది. ఇందులో ఒక సూపర్ ట్యాకిల్ కూడా ఉండటం విశేషం. బెంగాల్ వారియర్స్‌లో మనీందర్ సింగ్ 16 రైడింగ్ పాయింట్స్‌తో సత్తా చాటాడు. ఇందులో 13 టచ్ పాయింట్స్‌తో పాటు మూడు బోనస్ పాయింట్స్ ఉన్నాయి. 17 సార్లు రైడింగ్‌కు వెళ్లిన మనీందర్ సింగ్.. మూడు సార్లు ఔటవ్వడంతో పాటు మరో మూడు సార్లు పాయింట్స్ లేకుండా వచ్చాడు.

డిఫెండర్ శుభ్నమ్ షిండే 11 పాయింట్స్ సాధించగా.. నితిన్ కుమార్ 7 రైడింగ్ పాయింట్స్‌తో బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తమిళ తలైవాస్ రైడర్ నరేందర్ 13, అజింక్యా పవార్ 8 పాయింట్లతో రాణించారు.

ఈ టోర్నీలో తమిళ తలైవాస్‌కు ఇది తొలి పరాజయం కాగా.. బెంగాల్ వారియర్స్‌కు తొలి విజయం. పాట్నా పరైట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ టై అయ్యింది. మరోవైపు తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించిన తమిళ తళైవాస్.. బెంగాల్ వారియర్స్ చేతిలో మాత్రం చిత్తయ్యింది.

Story first published: Sunday, December 10, 2023, 22:13 [IST]
Other articles published on Dec 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+