For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2024: పుణేరి పల్టాన్, యూపీ యోధాస్ విజయం.. పట్నా, ఢిల్లీ చిత్తు!

ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11లో డిఫెండింగ్ ఛాంపియన్ పుణేరి పల్టాన్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ 40-25తో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 28-23 తేడా దబాంగ్ ఢిల్లీ‌ కేసీని ఓడించింది.

యూపీ యోధాస్-దబాంగ్ ఢిల్లీ మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. చివరి నిమిషంలో సత్తా చాటిన యూపీ యోధాస్ విజయాన్నందుకుంది. ఫస్టాఫ్‌లో 12-11 ఒకే ఒక్క పాయింట్ లీడ్ సాధించిన యూపీ యోధాస్.. రెండో అర్థ భాగంలో మాత్రం దుమ్మురేపింది. దబాంగ్ ఢిల్లీని ఆలౌట్ చేసింది. యోపీ యోధాస్ తరఫున భావాని రాజ్‌పుత్ 7 పాయింట్లతో.. సాహుల్ కుమార్ 5 పాయింట్లతో సత్తా చాటారు. ఢిల్లీలో అషు మాలిక్, నవీన్ కుమార్ నాలుగేసి పాయింట్స్ మాత్రమే సాధించారు.

Pro Kabaddi League 2024 Puneri Paltan beat Patna Pirates 40-25 UP Yoddhas win over Dabang Delhi a 28-23

పుణేరి పల్టాన్ ఏక పక్ష విజయం..
ఏకపక్షంగా సాగిన రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్.. పట్నా పైరేట్స్‌ను 15 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది. పుణేరి పల్టాన్ తరఫున అస్లామ్ ఇనామ్‌దర్ 9 పాయింట్స్, మోహిత్ గోయట్ 8 పాయింట్స్, గౌరవ్ ఖత్రి 6 పాయింట్స్, అమన్ 6 పాయింట్స్‌తో సత్తా చాటారు. పాట్నా పరైట్స్‌లో అయాన్ 5, దేవాంక్ 6 , అంకిత్ 6 పాయింట్స్ సాధించారు.

మ్యాచ్ ఆరంభం నుంచే పుణేరి పల్టాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దూకుడైన ఆటతో పుణేరి పల్టాన్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఫస్టాఫ్‌లో 20-10తో 10 పాయింట్స్ ఆధిక్యంలో నిలిచిన పుణేరి పల్టాన్.. సెకండాఫ్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైనా లీడ్ కాపాడుకొని విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.

Story first published: Monday, October 21, 2024, 22:40 [IST]
Other articles published on Oct 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+