For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2024: ప్చ్.. తెలుగు టైటాన్స్‌కు ఘోర పరాజయం!

ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తెలుగు టైటాన్స్ చిత్తయ్యింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 22-52 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో చిత్తయ్యింది.

జైపూర్ కెప్టెన్ అర్జున్ దేశ్‌వాల్.. 19 పాయింట్లతో సత్తా చాటడంతో తెలుగు టైటాన్స్ 30 పాయింట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అర్జున్ దేశ్‌వాల్‌కు తోడుగా అభిజిత్ మాలిక్(8) రాణించాడు. తెలుగు టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 7 పాయింట్స్, ఆశిష్ నర్వాల్, విజయ్ మాలిక్ ఐదేసి పాయింట్లతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.

Pro Kabaddi League 2024 Jaipur Pink Panthers demolish Telugu Titans 52-22

మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరా హెరీగా తలపడ్డాయి. దాంతో ఫస్టాఫ్‌ ముగిసే సరికి 18-13తో జైపూర్ ఐదు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో జైపూర్ దుమ్మురేపగా.. తెలుగు టైటాన్స్ చిత్తయ్యింది. జైపూర్ ఏకంగా 34 పాయింట్స్ సాధించగా.. తెలుగు టైటాన్స్ 9 పాయింట్స్‌కే పరిమితమైంది. తెలుగు టైటాన్స్‌ను మూడు సార్లు జైపూర్ ఆలౌట్ చేసింది.

సెకాండాఫ్‌తో ఏకపక్షంగా మారిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 41 రైడ్స్‌లో 13 సార్లే సక్సెస్ అయ్యింది. మరోవైపు జైపూర్ మాత్రం 40 ప్రయత్నాల్లో 23 సార్లు సక్సెస్ అవ్వడంతో పాటు ఒకసారి సూపర్ రైడ్ సాధించింది. ట్యాక్లింగ్‌లో తెలుగు టైటాన్స్ టీమ్ మరీ దారుణంగా విఫలమైంది. 31 ప్రయత్నాల్లో 5 సార్లు మాత్రమే సక్సెస్ అవ్వగా.. జైపూర్ 22 ప్రయత్నాల్లో 13 సార్లు పాయింట్స్ సాధించింది. దూకుడైన ఆటతో తెలుగు టైటాన్స్ మూల్యం చెల్లించుకుంది. విజయంతో ఈ టోర్నీని ప్రారంభించిన తెలుగు టైటాన్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Story first published: Tuesday, October 22, 2024, 21:45 [IST]
Other articles published on Oct 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+