Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PKL 2024: దబాంగ్ ఢిల్లీ శుభారంభం.. యు ముంబా ఓటమి!

ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11‌లో దబాంగ్ ఢిల్లీ శుభారంభం చేసింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 36-28 తేడాతో యూముంబాను ఓడించింది. దబాంగ్ ఢిల్లీ తరఫున రైడర్ అశు మాలిక్ 10 పాయింట్స్ సాధించగా.. డిఫెండర్ ఆశిష్ 4 పాయింట్స్‌తో సత్తా చాటాడు. యు ముంబా తరఫున ఆల్‌రౌండర్ జఫర్‌దానేష్ 11 పాయింట్స్, అజిత్ చావన్ 10 పాయింట్స్‌తో సత్తా చాటినా ఫలితం లేకపోయింది.

మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. ఫస్టాఫ్‌లో యు ముంబాను ఒకసారి ఆలౌట్ చేసిన దబాంగ్ ఢిల్లీ 19-15తో ఆధిక్యంలోకి వెళ్లింది. 12 రైడింగ్, 4 ట్యాకిల్, 2 ఆలౌట్, ఐదు ఎక్స్‌ట్రా పాయింట్స్‌తో పై చేయి సాధించింది. మరోవైపు యు ముంబా 12 రైడింగ్, మూడు ట్యాక్లింగ్ పాయింట్స్‌తో వెనుకంజలో నిలిచింది. సెకండాఫ్‌లోనూ అదే జోరు కనబర్చిన దబాంగ్ ఢిల్లీ ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంది. రైడింగ్, ట్యాక్లింగ్‌లో సమష్టిగా రాణించి యుముంబాపై పై చేయి సాధించింది.

Pro kabaddi league 2024 Dabang Delhi KC Beat U Mumba

అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37-29 తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్, స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ 13 పాయింట్స్‌తో సత్తా చాటాడు. అతనికి తోడుగా రైట్ కార్నర్ డిఫెండర్ క్రిషన్ ఆరు పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్‌లో స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ దారుణంగా విఫలమయ్యాడు. మూడే పాయింట్స్ సాధించాడు. సురిందర్ దెహాల్ 5 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

శనివారం జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్, పుణెరి పల్టాన్‌తో హరియానా స్టీలర్స్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది.

Story first published: Saturday, October 19, 2024, 8:37 [IST]
Other articles published on Oct 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+