Pro Kabaddi League 2021: త్వరలో సీజన్ 8.. ఆటగాళ్ల వేలం ఎప్పుడూ ఎక్కడంటే?

హైదారబాద్: భారత సంప్రదాయ క్రీడల్లో ఒకటైన కబడ్డీ ఆధునిక రూపంలో వాణిజ్య హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-8 సమరానికి రంగం సిద్దమైంది. కరోనా కారణంగా గతేడాది బ్రేక్ రాగా.. ఈ సారి డబుల్ ధమాకా అందించేందుకు ముస్తాబవుతోంది. 2014లో 8 జట్లతో ప్రారంభమైన పీకేఎల్ ప్రేక్షకాదరణతో అంచెలంచెలుగా ఎదిగి మరో 4 జట్ల చేరికతో బిగ్ లీగ్‌గా అవతరించింది. ఐపీఎల్ తరహాలోనే అభిమానగణాన్ని సంపాదించుకుంది. కబడ్డీ ఆటగాళ్లపై కనకవర్షం కురిపిస్తోంది.
పీకేఎల్ ఏడో సీజన్ వేలంలో ఫ్రాంచైజీలు సుమారు 200 మంది ఆటగాళ్ల కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేశాయి. సిద్దార్థ్ దేశాయ్ అత్యధికంగా రూ.1 కోటి 45 లక్షలకు తెలుగు టైటాన్స్ కొనుగోలు చేసింది. విదేశీ ఆటగాళ్లలో ఇరానీ ప్లేయర్ మహమ్మద్ ఇస్మాయిల్ నబిబక్ష్ అత్యధికంగా రూ.77.75 లక్షలకు బెంగాల్ వారియర్స్ తీసుకుంది. సుమారు రెండేళ్ల బ్రేక్ తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న పీకేఎల్ సీజన్ 8 వేలం ఈ నెల చివర్లో జరగనుంది. పీకేఎల్ సీజన్ 8 వేలానికి సంబంధించిన నిబంధనలు, టైమ్, రూల్స్, ఫ్రాంచైజీల సాలరీ పర్స్, ప్లేయర్ రిటెన్షన్ వివరాలు తెలుసుకుందాం.

వేలం ఎప్పుడంటే..
పీకేఎల్ సీజన్- 8 వేలం ముంబై వేదికగా ఈ నెల(ఆగస్టు) 29, 30, 31 తేదీల్లో జరగనుంది. ఈ వేలంలో 500 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు. పీకేఎల్ సీజన్ 6, 7 తోపాటు అమెచ్చూర్ కబడ్డి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎప్‌ఐ) సమక్షంలో జరగిన కబడ్డి చాంపియన్‌షిప్స్ 2020, 2021 టోర్నీల్లో పాల్గొన్న ఆటగాళ్లకు వేలంలో పాల్గొననున్నారు. సీజన్-8లో ప్రతీ ఫ్రాంచైజీ దగ్గర రూ.4.4 కోట్ల పర్స్ ఉంటుంది.
సీజన్-8 ప్లేయర్ వేలంలో డొమెస్టిక్, ఓవర్‌సీస్, న్యూ యంగ్ ప్లేయర్స్‌తో ఏబీసీడీ నాలుగు కేటగిరీలుగా విభజించనున్నారు. మళ్లీ అందులో ఆల్‌రౌండర్స్, డిఫెండర్స్, రైడర్స్‌గా సబ్ డివైడ్ చేయనున్నారు. కేటగిరి-ఏ ఆటగాళ్లకు రూ.30 లక్షలు, కేటగిరి -బి-రూ.20 లక్షలు, కేటగిరి సీ-రూ. 10 లక్షలు, కేటగిరి డీ-రూ.6 లక్షలు బేస్ ప్రైజ్‌గా నిర్ణయించారు.

రిటైన్ చేసుకునేది ఆరుగురినే..
ప్రతీ టీమ్ ఆరుగురు సీనియర్ ప్లేయర్లను.. మరో ఆరుగురరు యువ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతా ఆటగాళ్లు వేలంలోకి వస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేలం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానెల్స్‌లో ప్రసారం అవుతోంది. ఆన్‌లైన్ వేదిక డిస్నీ స్ట్రీమ్ హాట్‌స్టార్ వీఐపీలో కూడా ప్రత్యక్ష ప్రసాం జరుగుతోంది. అంతేకాకుండా అధికారిక ప్రొకబడ్డీ వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చు. డిసెంబర్ 2021లో సీజన్ 8 జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను అనుసరించి టోర్నీ జరగనుంది.

8 టీమ్స్..
1. బెంగాల్ వారియర్స్, 2. బెంగళూరు బుల్స్, 3. దంబంగ్ ఢిల్లీ, 4. జైపు పింక్ పాంథర్స్, 5. గుజరాత్ ఫార్చూనైట్స్, 6. తమిళ్ వారియర్స్, 7. తెలుగు టైటాన్స్, 8. యూ ముంబా, 9. హర్యానా స్టీలర్స్, 10. యూపీ యోధా,11. పాట్నా పైరెట్స్, 12. పుణేరి పల్టాన్,
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications