Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pro Kabaddi 2022: ఫైనల్లో పట్నా X ఢిల్లీ

Pro Kabaddi 2022: Dabang Delhi and Patna Pirates enters final

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌8లో పట్నా పైరేట్స్, దబాంగ్‌ ఢిల్లీ ఫైనల్‌కు చేరాయి. ఇప్పటికే మూడు సార్లు చాంపియన్ అయిన పట్నా పైరేట్స్.. ఇప్పటిదాకా ఒక్కసారి కూటా టైటిల్ గెలవని ఢిల్లీ దబాంగ్ టీమ్‌తో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. బుధవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ పట్నా 38-27 పాయింట్లతో యూపీ యోధను ఓడించగా.. ఢిల్లీ 40-35తో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది.

తొలి సెమీస్‌లో పట్నా జోరు ముందు యూపీ నిలవలేకపోయింది. స్టార్‌ రైడర్‌ పర్దీప్‌ నర్వాల్‌ (4పాయింట్లు) ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఆ జట్టుకు చేటు చేసింది. 16 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన పర్దీప్‌ కేవలం 4 పాయింట్లే తెచ్చాడు. పట్నా రైడర్లు గుమాన్‌ సింగ్‌ (8 పాయింట్లు), సచిన్‌ (7) కీలక సమయాల్లో సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫస్టాఫ్‌లోనే 23-9తో తిరుగులేని ఆధిక్యం సాధించి పట్నా ఫైనల్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. సెకండాఫ్‌లో యూపీ పుంజుకున్నా ప్రత్యర్థికి చేరువ కాలేకపోయింది.

రెండో సెమీస్‌ కూడా హోరాహోరీగానే సాగింది. అయితే రైడర్‌ నవీన్‌ కుమార్‌ (10 పాయింట్లు) సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ ఢిల్లీ ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. పవన్‌ షెరావత్‌ అద్భుత ప్రదర్శన చేస్తూ 18 పాయింట్లు సాధించినా.. మిగతా ఆటగాళ్ల నుంచి అతనికి సరైన సహకారం అందకపోవడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఫైనల్‌ శుక్రవారం జరుగనుంది.

Story first published: Thursday, February 24, 2022, 11:25 [IST]
Other articles published on Feb 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+