For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రొ కబడ్డీ: రెండో విజయం అందుకున్న దబాంగ్ ఢిల్లీ

Pro Kabaddi 2018: Bengal Warriors Handed First Defeat of Season by Dabang Delhi

న్యూ ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) ఇంటర్ జోనల్ చాలెంజ్‌లో ఢిల్లీ దబాంగ్ జట్టు అదిరిపోయే ఆటతీరుతో రెండో విజయం సాధించింది. ఆదివారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 39-30 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఢిల్లీ తరఫున నవీన్‌కుమార్ రైడింగ్‌లో 11 పాయింట్లతో విజృంభించగా, డిఫెండర్ రవీందర్ పహల్ నాలుగు ట్యాకిల్ పాయింట్లతో సత్తాచాటి ఢిల్లీకి విజయాన్ని అందించారు.

బెంగాల్ తరఫున ద్వితీయార్ధంలో

బెంగాల్ తరఫున ద్వితీయార్ధంలో

బెంగాల్ తరఫున ద్వితీయార్ధంలో స్టార్ రైడర్ జాంగ్‌కున్‌లీ 10 పాయింట్లతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. బెంగాల్‌ వారియర్స్‌ తరఫున జాంగ్‌ కున్‌ లీ 10, మణిందర్‌ సింగ్‌ 6, మహేశ్‌ గౌడ్‌ 5 రైడ్‌ పాయింట్లు సాధించారు ట్యాక్లింగ్‌లో సుర్జిత్‌ సింగ్‌ (2 పాయింట్లు) ఫర్వాలేదనిపించాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి రెండు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి.

ఐపీఎల్: సన్‌రైజర్స్‌ను వీడి ముంబైకి చేరిన ధావన్

మ్యాచ్‌ ఆరంభం నుంచి పోటాపోటీగా

మ్యాచ్‌ ఆరంభం నుంచి పోటాపోటీగా

దాంతో స్కోర్లు 2-2, 4-4 ఇలా సమం అవుతూ వచ్చాయి. మనిందర్‌ సింగ్‌ రైడింగ్‌లో రెండు పాయింట్లు తేవడంతో మ్యాచ్‌లో తొలిసారి ఎనిమిదో నిమిషంలో వారియర్స్‌ 8-5తో ఆధిక్యం సంపాదించింది. అయితే వెంటనే పుంజుకున్న ఢిల్లీ 8-8తో స్కోరు సమం చేసింది. అదే జోరులో వారియర్స్‌ను ఆలౌట్‌ చేసి 12-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ప్రథమార్ధం ముగిసేసరికి ఢిల్లీ 16-13 ఆధిక్యాన్ని

ప్రథమార్ధం ముగిసేసరికి ఢిల్లీ 16-13 ఆధిక్యాన్ని

ఇరు జట్లు మ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రథమార్ధం ముగిసేసరికి ఢిల్లీ 16-13 ఆధిక్యాన్ని అందుకుంది. కీలకమైన ద్వితీయార్ధంలో అదే జోరును కొనసాగిస్తూ ఢిల్లీ కీలక పాయింట్లతో విజయం వైపు నడిచింది. విరామం తర్వాత మరింత దూకుడుగా ఆడిన ఢిల్లీ రెండో సారి ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి 25-15తో తిరుగులేని స్థాయిలో నిలిచింది. మ్యాచ్‌ చివరి వరకు ఆదే ఆధిక్యాన్ని నిలబెట్టుకొని విజయం సాధించింది.

మంగళవారం జరిగే మ్యాచ్‌లలో

మంగళవారం జరిగే మ్యాచ్‌లలో

మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 27-25తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. సోమవారం విశ్రాంతి దినం కావడంతో.. మంగళవారం జరిగే మ్యాచ్‌లలో యు ముంబాతో తెలుగు టైటాన్స్‌.. తమిళ్‌ తలైవాస్‌తో పుణేరి పల్టన్‌ తలపడనున్నాయి.

Story first published: Monday, October 22, 2018, 9:47 [IST]
Other articles published on Oct 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+