భారత సంప్రదాయ క్రీడ కబడ్డీ.. అభిమానులను అలరించేందుకు మళ్లీ రెడీ అయ్యింది. ఇంతింతై అన్నట్లు ఎదిగిన ప్రొ కబడ్డీ లీగ్.. సీజన్ 11 కోసం ముస్తాబవుతోంది. అక్టోబర్ 18 నుంచి మళ్లీ కబడ్డీ కూత మొదలవ్వనుంది. ఇప్పటికే వేలం పూర్తవ్వగా.. ఈ సారి కబడ్డీ ప్లేయర్స్ పంట పడింది. స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రూ. కోట్లు కురిపించాయి.
లీగ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 8 మంది కబడ్డీ ఆటగాళ్లు కోట్లు పలికారు. రెండు రోజుల పాటు సాగిన వేలంలో సచిన్ తన్వార్ అత్యధిక ధర దక్కించుకున్నాడు. ఈ వేలంలో 12 ఫ్రాంచైజీలు మొత్తం 118 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపర్చిన తెలుగు టైటాన్స్.. ఈసారి జట్టును బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. వేలంలో కత్తిలాంటి ఆటగాళ్లను కోనుగోలు చేసింది.

తెలుగు టైటాన్స్ రూ. 1.725 కోట్లకు పవన్ సెహ్రావత్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది. డిఫెండర్లు క్రిషన్(రూ. 70 లక్షలు), మిలాద్ జబ్బారి(రూ. 13 లక్షలు), మహమ్మద్ మలాక్(రూ.13 లక్షలు), సుందర్(రూ. 13 లక్షలు), ఆల్‌రౌండర్లు విజయ్ మలిక్(రూ.20 లక్షలు), అమిత్ కుమార్(రూ. 9 లక్షలు), రైడర్లు మంజీత్(రూ.27 లక్షలు), ఆశీష్ నర్వాల్(రూ. 13 లక్షలు)ను టైటాన్స్ కొనుగోలు చేసింది. తెలుగు టైటాన్స్ మాజీ కెప్టెన్ రాహుల్ చౌదరిని ఈ సారి ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
వేలంలో తెలుగు టైటాన్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
పవన్ సెహ్రావత్(ఆల్‌రౌండ్)-రూ. 1.725 కోట్లు
క్రిషన్ ధుల్ (డిఫెండర్, రూ. 70 లక్షలు)
మంజీత్ (రైడర్, రూ. 27 లక్షలు)
విజయ్ మాలిక్ (ఆల్ రౌండర్, రూ. 20 లక్షలు)
మిలాద్ జబ్బారీ (డిఫెండర్, రూ. 13 లక్షలు)
మహ్మద్ మలక్ (డిఫెండర్, రూ. 13 లక్షలు)
సుందర్ (డిఫెండర్, రూ. 13 లక్షలు)
ఆశిష్ నర్వాల్ (రైడర్, రూ. 13 లక్షలు)
తెలుగు టైటాన్స్ రిటైన్ లిస్ట్:
శంకర్ భీమ్‌రాజ్ గడై (ఆల్ రౌండర్)
అజిత్ పాండురంగ్ పవార్ (డిఫెండర్)
ఎస్ సంజీవి (ఆల్ రౌండర్)
అంకిత్ (డిఫెండర్)
ప్రఫుల్ సుదమ్ జవారే (రైడర్)
ఓంకార్ నారాయణ్ పాటిల్ (రైడర్)
తెలుగు టైటాన్స్ పూర్తి జట్టు ఇదే..
రైడర్స్: ఆశిష్ నర్వాల్, మంజీత్, ప్రఫుల్ సుదమ్ జవారే, ఓంకార్ నారాయణ్ పాటిల్,
డిఫెండర్స్: మిలాద్ జబ్బారి, మహమ్మద్ మలక్, క్రిషన్ ధుల్ సుందర్, అమిత్, కుమార్, అజిత్ పాండురంగ్ పవార్, అంకిత్
ఆల్‌రౌండర్లు: పవన్ సెహ్రావత్, విజయ్ మాలిక్, శంకర్ భీమరాజ్, సంజీవ్