For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2025: ప్చ్.. ఓటమితో షురూ!

సీజన్లు గడుస్తున్నా.. కెప్టెన్లు మారినా.. కొత్త ఆటగాళ్లు వచ్చినా.. తెలుగు టైటాన్స్ రాత మాత్రం మారడం లేదు. ప్రొకబడ్డీ లీగ్ 12వ సీజన్‌ను కూడా తెలుగు టైటాన్స్ ఓటమితోనే ప్రారంభించింది. సాగర తీరం విశాఖ వేదికగా అంగరంగ వైభవంగా శక్రవారం మొదలైన ఈ టోర్నీలో తెలుగు టైటాన్స్ తీవ్రంగా నిరాశపర్చింది. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35-38 తేడాతో తమిళ తలైవాస్ చేతిలో ఓటమిపాలైంది. విజయం కోసం ఆఖరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. దేశ్వార్ 12 పాయింట్లతో తలైవాస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

పవన్ సెహ్రావత్ 9 పాయింట్స్ సాధించాడు. తెలుగు టైటాన్స్ తరఫున భరత్ హుడా 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫస్టాఫ్‌లో ఇరు జట్లూ హోరా హోరీగా తలపడగా.. తలైవాస్ 14-13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో పుంజుకున్న టైటాన్స్ ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 19-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ సెహ్రావత్ అద్భుత ప్రదర్శనతో తలైవాస్ పుంజుకుని 28-28తో స్కోర్‌ను సమం చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఆ జట్టు విజయం కైవసం చేసుకుంది.

PKL 2025 Telugu Titans Suffer Defeat in Opening Match Against Tamil Thalaivas

బెంగళూరు బుల్స్, పుణెరి పల్టాన్ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌ 32-32తో టై అయ్యింది. ఫలితం నిర్ణయించేందుకు కొత్త రూల్స్ ప్రకారం 5 రైడ్స్ ఆడించగా.. పుణెరి 6-4తో విజయం సాధించింది. బెంగళూరులో ఆకాశ్ షిండే(12) రాణించగా.. పుణెరి తరఫున ఆదిథ్య షిండే(9) సత్తా చాటాడు. ఈ టోర్నీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించగా.. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, అథ్లెట్ జ్యోతి యర్రాజి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. నేడు జరిగే పోటీల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్, గుజరాత్ టైటాన్స్‌తో యు ముంబా తలపడనుంది.

Story first published: Saturday, August 30, 2025, 13:49 [IST]
Other articles published on Aug 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+