ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12లో పుణెరి పల్టాన్ దుమ్మురేపుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. బుధవారర విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 45-36 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. అస్లామ్ ఇనామ్‌దార్(11), ఆదిత్య షిండే(11) అద్భుత ప్రదర్శనతో పుణెరి పల్టాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దెవాంక్ 17 పాయింట్స్‌తో సత్తా చాటినా ఫలితం దక్కలేదు.
అతనికి తోడుగా మరే ఆటగాడు రాణించలేదు. మ్యాచ్ ఆరంభం నుంచి బెంగాల్ వారియర్స్ అసాధారణ ప్రదర్శన కనబర్చింది. ఫస్టాఫ్‌లో 26-22తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో మరింత చెలరేగిన పుణెరి పల్టాన్ ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.

హరియాణా స్టీలర్స్, యు ముంబా మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. కొత్త ఫార్మాట్ ప్రకారం 5 రైడ్స్‌లో హరియాణా స్టీలర్స్ 7-6తో విజయాన్ని సొంతం చేసుకుంది. యు ముంబాలో అజిత్ చౌహన్(12) రాణించగా.. హరియాణా స్టీలర్స్‌లో నవీన్ కుమార్(9), వినయ్(8) పాయింట్స్‌తో సత్తా చాటారు.
జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు)
పుణెరి పల్టాన్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ(రాత్రి 9 గంటలకు)