For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2025: దుమ్మురేపిన తెలుగు టైటాన్స్.. గట్టెక్కిన ఢిల్లీ!

ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 12లో తెలుగు టైటాన్స్ దుమ్మురేపుతోంది. ఓటమితో ఈ టోర్నీని ప్రారంభించిన తెలుగు టైటాన్స్ వరుసగా రెండు విజయాలను నమోదు చేసింది. కెప్టెన్ విజయ్ మాలిక్(11), ఆల్‌రౌండర్ భరత్ హుడా(12) అసాధారణ ప్రదర్శనతో తెలుగు టైటాన్స్ విజయాల బాటపట్టింది. ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 44-34 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది.

విజయ్ మాలిక్, భరత్ హుడాతో పాటు ఛేతన్ సాహు(5), డిఫెండర్ అంకిత్(5) మెరుగైన ప్రదర్శన చేశారు. బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంక్(13), డిఫెండర్స్ నితీష్ కుమార్(6), ఆషిష్(5) రాణించినా ఫలితం లేకపోయింది. మరో ఎండ్‌లో వారికి సహకారం లభించలేదు.

మ్యాచ్ ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ తొలి రైడ్‌లోనే దేవాంక్‌ను పట్టేసి పాయింట్స్ ఖాతా తెరిచింది. అదే జోరులో బెంగాల్ వారియర్స్‌ను ఆలౌట్ చేసింది. దాంతో ఫస్టాఫ్ ముగిసే సరికి తెలుగు టైటాన్స్ 23-14 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో బెంగాల్ వారియర్స్ పుంజుకున్నా.. తెలుగు టైటాన్స్ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇరు జట్లు చెరోసారి ఆలౌటయ్యాయి. కానీ ఫస్టాఫ్‌లో లభించిన భారీ ఆధిక్యం తెలుగు టైటాన్స్‌కు కలిసొచ్చింది.

PKL 2025 Dabang Delhi Triumphs in Thriller Telugu Titans Dominate

గట్టెక్కిన దబాంగ్ ఢిల్లీ

ఉత్కంఠగా సాగిన రెండో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 36-35 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. ఆఖరి రైడ్‌లో జైపూర్ రైడర్ నితిన్ కుమార్ చేసిన తప్పిదం ఆ జట్టు కొంపముంచింది. మ్యాచ్ చివరి రైడ్‌లో నితిన్ కుమార్ పాప్ లైన్ క్రాస్ చేయకుండానే వెనుదిరిగాడు. దాంతో సూపర్ ట్యాకిల్ కింద దబాంగ్ ఢిల్లీకి రెండు పాయింట్స్ లభించాయి. నితిన్ కుమార్ తప్పిదంతో దబాంగ్ ఢిల్లీ ఒక్క పాయింట్‌ తేడాతో గెలిచింది. ఈ ఆఖరి రైడ్‌లో నితిన్ కుమార్ పాప్ లైన్ క్రాస్ చేసినా.. జైపూర్ పింక్ పాంథర్స్ గెలిచేది. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోలేకనే నితిన్ కుమార్ ఈ తప్పిదం చేశాడు.

విచిత్రం ఏంటంటే జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున టాప్ స్కోరర్ నితిన్ కుమార్(14) కావడం విశేషం. అతనికి తోడుగా సాహిత్ సత్పాల్ రాణించాడు. దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ అషు మాలిక్ 21 పాయింట్స్‌తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి జైపూర్ పింక్ పాంథర్స్ ఆధిపత్యం చెలాయించింది. ఫస్టాఫ్‌లో ఢిల్లీని ఒకసారి ఆలౌట్ చేసిన జైపూర్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి 20-15‌తో ఆధిక్యంలో నిలిచింది. అయితే సెకండాఫ్‌లో దబాంగ్ ఢిల్లీ దుమ్మురేపేంది. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. కానీ ఆఖరి రైడ్ దబాంగ్ ఢిల్లీకి కలిసొచ్చింది.

Story first published: Monday, September 8, 2025, 11:04 [IST]
Other articles published on Sep 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+