ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12లో యు ముంబా దుమ్మురేపుతోంది. వరుసగా రెండో విజయం నమోదు చేసింది. వైజాగ్ వేదికగా ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా 36-33 తేడాతో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. అజిత్ చౌహన్(9), అనిల్(8) యు ముంబా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తమిళ్ తలైవాస్ తరఫున అర్జున్ దేశ్‌వాల్(12), కెప్టెన్ పవన్ సెహ్రావత్(7) రాణించినా ఫలితం లేకపోయింది.
ఫస్టాఫ్ ముగిసే సమయానికి 14-11 తేడాతో ఆధిక్యంలో నిలిచిన తమిళ్ తలైవాస్.. సెకండాఫ్‌లో తడబడింది. రైడింగ్‌లో సత్తా చాటిన యు ముంబా తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. ఓ దశలో 18-26తో వెనుకబడిన యు ముంబా.. చివరి 10 నిమిషాల్లో అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది.

రెండో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 54-44 తేడాతో హర్యానా స్టీలర్స్‌ను ఓడించింది. 21 పాయింట్లతో దెవాంక్ బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మన్‌ప్రీత్(13) సత్తా చాటాడు. హర్యానా స్టీలర్స్‌లో శివమ్ పతారే(17), వినయ్(13) రాణించినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే బెంగాల్ వారియర్స్ దుమ్మురేపింది. ఫస్టాఫ్‌లో హర్యానాను ఒకసారి ఆలౌట్ చేసిన బెంగాల్ 23-19తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో మరింత దూకుడుగా ఆడిన బెంగాల్ ఆధిక్యాన్ని పెంచుకొని విజయం సొంతం చేసుకుంది.
నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధాస్, పుణేరి పల్టాన్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడ్డాయి. తొలి మ్యాచ్ 8 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో మ్యాచ్ 9 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లు జియో హాట్‌స్టార్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్‌లో వీక్షించవచ్చు.