ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్-11లో తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33-36తో యూపీ యోధాస్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి అసాధారణ ప్రదర్శన కనబర్చిన తెలుగు టైటాన్స్ కీలక సమయంలో చేతులెత్తేసి ఓటమికి తల వంచింది.
ఆరంభంలో దూకుడుగా ఆడిన తెలుగు టైటాన్స్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి 17-10తో ఆధిక్యంలో నిలిచింది. రైడింగ్, ట్యాక్లింగ్‌లో సత్తా చాటి యూపీ యోధాస్‌ను ఒకసారి ఆలౌట్ కూడా చేసింది.

సెకండాఫ్‌లో జూలు విధిల్చిన యూపీ యోధాస్ దూకుడుగా ఆడింది. వరుస పాయింట్లతో తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేసి ఆధిక్యంలో దూసుకెళ్లింది. మధ్యలో తెలుగు టైటాన్స్ పుంజుకొని యూపీ యోధాస్‌ను ఆలౌట్ చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. మ్యాచ్ టైగా ముగుస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివర్లో యూపీ యోధాస్ వరుస పాయింట్లతో పై చేయి సాధించడంతో పాటు విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.
యూపీ తరఫున సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ గగన్ గౌడ(15)తో పాటు భవానీ రాజ్‌పుత్(6) సత్తా చాటారు. తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్(11), మంజీత్(7) రాణించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం తెలుగు టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 9 విజయాలు సాధించి ఏడింటిలో ఓటమిపాలైంది. మరోవైపు యూపీ యోధాస్ 15 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, ఒక టైతో ఐదో స్థానంలో నిలిచింది.
బెంగాల్ విజయం..
మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 39-32 తేడాతో హర్యానా స్టీలర్స్‌ను ఓడించింది. బెంగాల్ తరఫున మనీందర్ సింగ్(11), ప్రణయ్ రానే(6), మయుర్ కదమ్(5) రాణించారు. హర్యానా తరఫున వినయ్(10), శివమ్ పటారే(8) రాణించినా ఫలితం లేకపోయింది.
ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో ఫస్టాఫ్ ముగిసే సరికి 17-17తో సమంగా నిలిచాయి. సెకండాఫ్‌లో దుమ్మురేపిన బెంగాల్.. హర్యానాను ఆలౌట్ చేసి పై చేయి సాధించింది.