Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PKL 2024: ఉత్కంఠపోరులో పట్నాకు షాకిచ్చిన యు ముంబా!

ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) 2024 సీజన్‌లో యు ముంబా మరో విజయం సాధించింది. గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా 43-37 తేడాతో పట్నా పైరేట్స్‌కు షాకిచ్చింది. అజిత్ చౌహన్(15) సంచలన ప్రదర్శనతో యు ముంబాకు విజయాన్నందించాడు. సునీల్ కుమార్(5) రాణించాడు. మరోవైపు పట్నా పైరేట్స్‌లో దేవాంక్(12), అయాన్(7) రాణించినా ఫలితం లేకపోయింది.

ఆరంభం నుంచే యుముంబా జోరు కొనసాగించింది. పట్నాను ఒకసారి ఆలౌట్ చేసి ఫస్టాఫ్ ముగిసే సరికి 24-14 తేడాతో భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. అయితే సెకండాఫ్‌లో జూలు విధిల్చిన పట్నా అసాధారణ ప్రదర్శనతో చెలరేగింది. యు ముంబాను ఆలౌట్ చేసిన పట్నా.. ఫస్టాఫ్ ఆధిక్యాన్ని తగ్గించుకుంది. కానీ చివర్లో తడబడి ఓటమిపాలైంది.

PKL 2024 UP Yoddhas Beat Gujarat Giants and U Mumba Win Over Patna Pirates

ఇప్పటికే పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ చేరగా.. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మరోవైపు తృటిలో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కోల్పోయిన యుముంబా టాప్-5 స్థానాన్ని నిలబెట్టుకుంది.

యూపీ యోధాస్ ఘన విజయం..
మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 59-23తో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో యూపీ యోధాస్ లీగ్ దశను విజయంతో ముగించింది. యూపీ విజయంలో గగన్ గౌడ(19), భావనీ రాజ్‌పుత్(11), సుమిత్(5) అసాధారణ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించారు. గుజరాత్ జెయింట్స్‌తో గుమన్ సింగ్(7) మినహా మరే ఆటగాడు రాణించలేదు.

ఫస్టాఫ్ నుంచి యూపీ యోధాస్ దుమ్మురేపింది. తొలి అర్థ భాగంలోనే గుజరాత్ జెయింట్స్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసిన యూపీ 29-11‌తో భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. సెకండాఫ్‌లోనూ అదే జోరును కొనసాగించిన యూపీ.. మరో రెండు సార్లు ఆలౌట్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఈ విజయం యూపీ యోధాస్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

నేటీ మ్యాచ్‌లు:

జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్, రాత్రి 8 గంటల నుంచి

పుణెరి పల్టాన్ వర్సెస్ తెలుగు టైటాన్స్, రాత్రి 9 గంటల నుంచి

Story first published: Friday, December 20, 2024, 9:43 [IST]
Other articles published on Dec 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+