ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11 తుది దశకు చేరుకుంది. దిగ్విజయం లీగ్ దశ ముగిసి నాకౌట్ సమరానికి రంగం సిద్దమైంది. మొత్తం 12 జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో ఒక్కో టీమ్ 22 మ్యాచ్‌లు ఆడాయి. టాప్-6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. డిసెంబర్ 26 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
పీకేఎల్ ఫ్లే ఆఫ్స్ ఫార్మాట్ ఏంటంటే..?
ఇతర టోర్నీలతో పోల్చితే ప్రోకబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ విభిన్నంగా ఉంటుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయి. టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్-1 , సెమీఫైనల్-2 ఆడుతాయి. తర్వాతి నాలుగు జట్లు ఎలిమినేటర్-1, ఎలిమినేటర్-2 మ్యాచ్‌ల్లో తలపడుతాయి. ఎలిమినేటర్-1లో గెలిచిన జట్టు సెమీఫైనల్-1, ఎలిమినేటర్-2లో గెలిచిన జట్టు సెమీఫైనల్-2 ఆడుతాయి.

ప్లే ఆఫ్స్ చేరిన జట్లు..
22 మ్యాచ్‌ల్లో 16 విజయాలు సాధించిన హరియాణ స్టీలర్స్ టేబుల్ టాపర్‌గా నిలిచి సెమీఫైనల్-1కు అర్హత సాధించింది. 22 మ్యాచ్‌ల్లో 13 విజయాలు, 4 డ్రాలతో దబాంగ్ ఢిల్లీ కేసీ పాయింట్స్ టేబుల్ రన్నరప్‌గా నిలిచి సెమీఫైనల్-2కు క్వాలిఫై అయ్యింది. 22 మ్యాచ్‌ల్లో 13 విజయాలు 3 డ్రాలతో యూపీ యోధాస్ మూడో స్థానంలో.. పట్నా పైరేట్స్(22 మ్యాచ్‌ల్లో 13 విజయాలు, 2 డ్రాలతో) నాలుగో స్థానంలో.. యుముంబా(12 విజయాలు, 2 డ్రాలతో) ఐదోస్థానంలో.. జైపూర్ పింక్ పాంథర్స్(12 విజయాలు, 2 డ్రాలతో) ఆరో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
12 విజయాలతో తెలుగు టైటాన్స్ ఏడో స్థానంలో నిలిచి ఏడో స్థానంలో సరిపెట్టుకుంది. పుణేరి పల్టాన్(9 విజయాలు 3 డ్రాలు), తమిళ్ తలైవాస్(8 విజయాలు, ఒక డ్రా), బెంగాల్ వారియర్స్(5 విజయాలు, 3 డ్రాలు), గుజరాత్ జెయింట్స్(5 విజయాలు, 3 డ్రాలు), బెంగళూరు బుల్స్(2 విజయాలు, ఒక డ్రా) వరుసగా చివరి ఐదు స్థానాలకు పరిమితమయ్యాయి.
ప్లే ఆఫ్స్ షెడ్యూల్..
డిసెంబర్ 26: ఎలిమినేటర్1: యూపీ యోధాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్(రాత్రి 8గంటలకు)
డిసెంబర్ 26: ఎలిమినేటర్ 2: పట్నా పైరేట్స్ వర్సెస్ యు ముంబా(రాత్రి 9గంటలకు)
డిసెంబర్ 27: సెమీ ఫైనల్ 1:హర్యానా స్టీలర్స్ వర్సెస్ ఎలిమినేటర్-1 విజేత(రాత్రి 8గంటలకు)
డిసెంబర్ 27: సెమీ ఫైనల్ 2:దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ ఎలిమినేటర్-2 విజేత(రాత్రి 9గంటలకు)
డిసెంబర్ 29: ఫైనల్ : సెమీస్-1 విజేత వర్సెస్ సెమీస్-2 విజేత(రాత్రి 8గంటలకు)
ఎలా చూడాలంటే..?
ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్‌కు అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా స్టార్ స్పోర్ట్స్ వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌కు చెందిన డిస్నీ హాట్‌స్టార్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్, భాషా చానెల్లో కూడా మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.