Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PKL 2024: ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ విజయం!

ప్రొ కబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ -11లో తెలుగు టైటాన్స్ మరో విజయాన్నందుకుంది. హ్యాట్రిక్ పరాజయాలతో తర్వాత తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు గాడిలో పడింది. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28-26 తేడా పట్నా పరేట్స్‌పై గెలుపొందింది.

ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఫస్టాఫ్ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 10-13 తేడాతో మూడు పాయింట్స్ వెనుకంజలో నిలిచింది.

PKL 2024 Pawan Sehrawat Ashish Narwal helps Telugu Titans to win over Patna Pirates

ఫస్టాఫ్‌లో 6 రైడింగ్ పాయింట్స్ సాధించిన తెలుగు టైటాన్స్.. ట్యాక్లింగ్‌లో నాలుగు పాయింట్స్ రాబట్టింది. మరోవైపు పట్నా కూడా 6 రైడింగ్ పాయింట్స్, నాలుగు ట్యాక్లింగ్ పాయింట్స్ సాధించింది. కానీ ఆ జట్టుకు మూడు ఎక్స్‌ట్రా పాయింట్స్ లభించాయి.

సెకండాఫ్‌లో పుంజుకున్న తెలుగు టైటాన్స్.. అశిష్ నర్వాల్(9), కెప్టెన్ పవన్ సెహ్రావత్(5), అంకిత్(4) చెలరేగడంతో రేసులో నిలిచింది. మరోవైపు పట్నా కూడా గట్టిగానే పోరాడటంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగించింది. ఫలితం ఎటువైపు మళ్లతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పాయింట్ పాయింట్‌కు ఉత్కంఠ రెట్టింపు అవ్వగా.. తెలుగు టైటాన్స్ సంచలన ప్రదర్శనతో విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.

మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్‌కు ఇది రెండో విజయం మాత్రమే. ఈ సీజన్ ఆరంభం మ్యాచ్‌లో బుల్స్‌ను ఓడించిన తెలుగు టైటాన్స్ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 2 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 6 స్థానంలో కొనసాగుతోంది.

హరియాణా విజయం..
మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41-34 తేడాతో దబంగ్ ఢిల్లీని ఓడించింది. ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన హరియాణా ఫస్టాఫ్ ముగిసే సమయానికి 24-13 తేడాతో 9 పాయింట్స్ ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లోనూ అదే జోరును కొనసాగించి విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. హరియాణా తరఫున మహ్మద్ రెజా సూపర్-10తో సత్తా చాటాడు. దబాంగ్ ఢిల్లీ తరఫున అషు మాలిక్(13) రాణించినా ఫలితం లేకపోయింది.

నేటి షెడ్యూల్..
నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియల్స్ వర్సెస్ పుణెరి పల్టాన్, బెంగళూరు బుల్స్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ తలపనున్నాయి. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. రెండో మ్యాచ్‌ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతోంది.

Story first published: Tuesday, October 29, 2024, 10:15 [IST]
Other articles published on Oct 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+