For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2024: ఉత్కంఠ పోరులో బెంగాల్ వారియర్స్ విజయం!

ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్ సీజన్ 11లో బెంగాల్ వారియర్స్ ఎట్టకేలకు విజయాన్నందుకుంది. తెలుగు టైటాన్స్‌తో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాస్‌తో రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 32-29 తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించింది.

స్టార్ రైడర్ మనీందర్ సింగ్(8), సుశీల్ కంబ్రేకర్(7), నితీ ధనకర్(7) కీలక సమయంలో పాయింట్స్ రాబట్టి బెంగాల్ వారియర్స్‌కు విజయాన్నందించారు. యూపీ యోధాస్ తరఫున భారత్ 13 పాయింట్స్‌తో సత్తా చాటినా లాభం లేకపోయింది. ఇతర ఆటగాళ్ల నుంచి అతనికి సహకారం లోపించింది.

PKL 2024 Maninder Singh helps Bengal warriors beat UP Yoddha by 32-39

వరుసగా రెండు విజయాలతో ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న యూపీ యోధాస్‌కు బెంగాల్ వారియర్స్ ఓటమి రుచి చూపించింది. ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో ఫస్టాఫ్ ముగిసేసరికి 12-11 తో బెంగాల్ ఆధిక్యం సాధించింది.

సెకండాఫ్‌లోనూ యూపీ యోధాస్ నుంచి బెంగాల్ వారియర్స్‌కు గట్టి పోటీనిచ్చింది. ఇరు జట్లు ఆఖరి వరకు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి నిమిషాల్లో బెంగాల్ వారియర్స్ రైడర్స్ స్పీడ్ పెంచి విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.

Story first published: Thursday, October 24, 2024, 22:27 [IST]
Other articles published on Oct 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+