Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PKL 2024: యు ముంబా ఘోర పరాజయం.. తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం!

ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11 ప్లే ఆఫ్స్ సమరం రసవత్తరంగా మారింది. టేబుల్ టాపర్‌గా హరియాణా స్టీలర్ట్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 47-30 తేడాతో యు ముంబాను చిత్తు చేసింది. హరియాణా లెఫ్ట్ రైడర్స్ శివమ్ పటారే 14 పాయింట్లతో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

యుముంబాలో సతీష్ కన్నర్(9) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన హరియాణా.. ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసి ఫస్టాఫ్ ముగిసే సమయానికి 26-14 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత కూడా అదే జోరును కొనసాగించిన హరియాణా సునాయస విజయాన్నందుకుంది. 22 మ్యాచ్‌ల్లో 16 విజయాలతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న హరియాణా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

PKL 2024 How can Telugu Titans still qualify for playoffs after Haryana Steelers defeating U Mumba

చివరి మ్యాచ్‌లో ఓడితే..
యు ముంబా పరాజయంతో తెలుగు టైటాన్స్ శిభిరంలో ఆశలు రేకెత్తాయి. ఈ మ్యాచ్‌లో 17 పాయింట్స్ తేడాతో ఓడిన యు ముంబా తమ చివరి మ్యాచ్‌లో మరో 13 పాయింట్స్ తేడాతో ఓటమిపాలైతే తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరుతోంది. ఆ జట్టు బెంగాల్ వారియర్స్‌తో మంగళవారం చివరి మ్యాచ్ ఆడనుంది.

అయితే ఈ సీజన్‌లో బెంగాల్ వారియర్స్ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆ జట్టు ఫామ్ నేపథ్యంలో యు ముంబా ఓటమి కష్టమే అని చెప్పవచ్చు. అద్భుతం జరిగితే తప్పా తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరదు. మొత్తం 22 మ్యాచ్‌ల్లో 12 విజయాలు, 10 ఓటములతో తెలుగు టైటాన్స్ ఏడో స్థానంలో కొనసాగుతోంది.

పీకేఎల్ ఫ్లే ఆఫ్స్ ఫార్మాట్ ఏంటంటే..?
ఇతర టోర్నీలతో పోల్చితే ప్రోకబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ విభిన్నంగా ఉంటుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయి. టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్-1 ఆడనుండగా.. తర్వాతి నాలుగు జట్లు ఎలిమినేటర్-1, ఎలిమినేటర్-2 మ్యాచ్‌లు ఆడుతాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు సెమీఫైనల్-2 ఆడుతాయి. సెమీఫైనల్-1, సెమీఫైనల్-2‌లో గెలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి.

టేబుల్ టాపర్‌గా హర్యానా స్టీలర్స్, రన్నరప్‌గా పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకున్నాయి. యూపీ యోధాస్, దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్ నాలుగు, ఐదు, స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఆరో స్థానం కోసం యు ముంబా, తెలుగు టైటాన్స్ మధ్య పోటీ నెలకొంది. యు ముంబా తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి డ్రా చేసుకున్నా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.

తమిళ్ తలైవస్ విజయం..
ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 42-32 తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. విరామ సమయానికి 14-13 తేడాతో నిలిచిన తలైవాస్.. సెకండాఫ్‌లో అసాధారణ ప్రదర్శనతో విజయాన్నందుకుంది. ఆ జట్టులో హిమాంశు(13) రాణించాడు.

Story first published: Monday, December 23, 2024, 9:52 [IST]
Other articles published on Dec 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+