For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2024: పుణేరి పల్టాన్, పాట్నా పైరేట్స్ విజయం!

ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్ సీజన్ 11లో పుణేరి పల్టాన్ మళ్లీ విజయాల బాట పట్టింది. గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి త్వరగానే తేరుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టాన్36-22 తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.

పుణేరి పల్టాన్ తరఫున పంకజ్(6), కెప్టెన్ అస్లాం(5), మోహిత్(6), గౌరవ్(4), అమన్(4) సమష్టిగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరు బుల్స్‌లో ఆల్‌రౌండర్ పంకజ్ 6 పాయింట్లతో సత్తా చాటగా.. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు.

PKL 2024 Bengaluru Bulls loses 36-22 vs Puneri Paltan Devank s 25 raid points help Patna Pirates beats Tamil Thalaivas 42-40

మ్యాచ్ ఆరంభం నుంచే పుణేరి పల్టాన్ ఆధిపత్యం చెలాయించింది. రైడింగ్, ట్యాక్లింగ్‌లో అదరగొట్టింది. దాంతో ఫస్టాప్‌లోనే బెంగళూరు బుల్స్‌ను ఒకసారి ఆలౌట్ చేసి 18-11 తేడాతో పుణేరి పల్టాన్ ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో‌నూ అదే జోరు కనబర్చిన పుణేరి పల్టాన్ ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకొని విజయాన్నందుకుంది.

PKL 2024 Bengaluru Bulls loses 36-22 vs Puneri Paltan Devank s 25 raid points help Patna Pirates beats Tamil Thalaivas 42-40

ఉత్కంఠగా సాగిన మరో మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ 42-40 తేడాతో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. పాట్నా పైరేట్స్ రైడర్ దేవాంక్ 25 పాయింట్లతో సత్తా చాటాడు. తమిళ్ తలైవాస్ తరఫున నరేందర్ కండాలా 15 పాయింట్స్‌తో రాణించినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూముంబా, బెంగాల్ వారియర్స్ రాత్రి 8 గంటలకు, తెలుగు టైటాన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ 9 గంటలకు తలపడనున్నాయి.

Story first published: Saturday, October 26, 2024, 10:06 [IST]
Other articles published on Oct 26, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+