న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మణిందర్‌ మాయ.. పట్నాపై బెంగాల్‌ ఘన విజయం

Pro Kabaddi League 2019 : Bengal Warriors Defeat Patna Pirates 35-26 || Oneindia Telugu
PKL 2019: Maninder Singh shines again Bengal Warriors thrash Patna Pirates 35-26

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్‌లో బెంగాల్‌ ఐదో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. రైడింగ్‌లో మణిందర్‌ సింగ్‌ (10) మాయ చేయడంతో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 35-26 తేడాతో పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది. రింకు నర్వాల్‌ (5) ట్యాక్లింగ్‌లో రాణించాడు. పైరేట్స్ తరఫున డుబ్కీ కింగ్‌ పర్దీప్‌ నర్వాల్ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలపించలేకపోయాడు.

<strong>సాయిప్రణీత్‌ సంచలనం.. ప్రిక్వార్టర్స్‌లో ఓడిన శ్రీకాంత్, సైనా</strong>సాయిప్రణీత్‌ సంచలనం.. ప్రిక్వార్టర్స్‌లో ఓడిన శ్రీకాంత్, సైనా

పాట్నా జోరు:

పాట్నా జోరు:

మ్యాచ్ ఆరంభంలో పర్దీప్‌ నర్వాల్ వరుస పాయింట్లతో విజృంభించడంతో పాట్నా ఆధిక్యంలో నిలిచింది. తొలి ఐదు నిమిషాలు ముగిసే సరికి పాట్నా 8-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రపంజన్‌ (6) రాణించడంతో తిరిగి పుంజుకొన్న బెంగాల్‌.. ఓ దశలో 11-11తో స్కోరును సమం చేసింది. ఊపులోకొచ్చిన బెంగాల్ గట్టి పోటీనివ్వడంతో.. పాట్నా పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడింది. దీంతో తొలి అర్ధ భాగం ముగిసే సరికి బెంగాల్ 15-14తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.

మణిందర్‌ మాయ:

మణిందర్‌ మాయ:

విరామం తర్వాత మణిందర్‌ చెలరేగడంతో పాట్నాను ఆలౌట్‌ చేసిన బెంగాల్‌ 19-14తో ఆధిక్యం సాధించింది. అక్కడి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన బెంగాల్‌ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వరుసగా పాయింట్లు సాధిస్తూ.. ఆధిక్యం పెంచుకుంటూ దూసుకుపోయింది. ప్రత్యర్థిని మరోసారి ఆలౌట్ చేసి భారీ లీడ్ సొంతం చేసుకుంది. మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా 34-17తో నిలిచిన బెంగాల్‌ విజయం ఖాయం చేసుకుంది.

ఆరేసిన ఆర్చర్.. 179 పరుగులకే ఆసీస్ ఆలౌట్

పర్దీప్‌ ఒంటరి పోరాటం:

పర్దీప్‌ ఒంటరి పోరాటం:

అయితే చివరి ఐదు నిమిషాల్లో పర్దీప్‌ నర్వాల్ వరుస రైడ్ పాయింట్లతో విజృంభించినా.. పాయింట్ల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. చివరి వరకు ఆధిక్యాన్ని నిలుపుకొని బెంగాల్‌ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో బెంగాల్‌ 33 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా.. పట్నా 17 పాయింట్లతో అట్టడుగున కొనసాగుతోంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్, తమిళ్‌ తలైవాస్‌తో యు ముంబా తలపడతాయి.

Story first published: Friday, August 23, 2019, 9:36 [IST]
Other articles published on Aug 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X