Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రో కబడ్డీ: ఎన్నాళ్లకెన్నాళ్లకు పాయింట్ల పట్టికలో జైపుర్ అగ్రస్థానం

 PKL 2019: Jaipur pink panthers top of the points table

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ ఏడో సీజన్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సొంతగడ్డపై జరిగిన చివరి అంచె మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను జైపుర్ పింక్ పాంథర్స్ ఓడించింది. శుక్రవారం రాత్రి చివరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై 22-19 పాయింట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ధోని తిరుగుపయనం: లేహ్ విమానాశ్రయంలో సందడి, ఫోటోలు వైరల్

ఏడో సీజన్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు ఇది ఆరో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో జైపుర్ పింక్ పాంథర్స్ జట్టు రైడింగ్‌లో 9 పాయింట్లు, ట్యాకిల్స్‌లో 13 ఇలా మొత్తం 22 పాయింట్లు సాధించగా.... గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ రైడింగ్‌లో 8, ట్యాకిల్స్‌లో 9, ఎక్స్‌ట్రాల ద్వారా మరో 2 మొత్తం 19 పాయింట్లు మాత్రమే సాధించింది.

 PKL 2019: Jaipur pink panthers top of the points table

జైపుర్ పింక్ పాంథర్స్ జట్టులో దీపక్ హుడా 5 రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకోగా... విశాల్ 3 పాయింట్లతో టాప్ ఢిపెండర్‌గా నిలిచాడు. మరోవైపు గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌‌లో సచిన్ 3 రైడ్ పాయింట్లతో ఆకట్టుకోగా... పంకజ్ 6 ట్యాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. తాజా విజయంతో దబాంగ్ ఢిల్లీని వెనక్కునెట్టి జైపుర్ అగ్రస్థానంలో నిలిచింది.

ఏడో సీజన్‌లో జైపుర్ పింక్ పాంథర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి.. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఫలితంగా మొత్తం 30 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత దబాంగ్ ఢిల్లీ 26 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. బెంగాల్ వారియర్స్ 25 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది.

కెప్టెన్సీ బాధ్యతలను కొనసాగించాలా? వద్దా?: సందిగ్ధంలో మోర్గాన్

ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోన్న తెలుగు టైటాన్స్ జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తాయి.

Story first published: Saturday, August 17, 2019, 13:53 [IST]
Other articles published on Aug 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+