Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని తిరుగుపయనం: లేహ్ విమానాశ్రయంలో సందడి, ఫోటోలు వైరల్

Lieutenant Colonel MS Dhoni completes 15-day Army stint, spotted at Leh airport

హైదరాబాద్: టెరిటోరియల్ ఆర్మీకి రెండు వారాల పాటు సేవలందించేందుకు గాను జమ్ము కశ్మీర్‌కు వెళ్లిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, తన విధులను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఢిల్లీకి తిరుగుపయనమయ్యాడు. ఈ మేరకు శనివారం లేహ్ విమానాశ్రయంలో ధోని దర్శనమిచ్చిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

106 టెరిటోరియల్ ఆర్మీకి చెందిన పారా బెటాలియన్‌తో కలిసి ధోని 15 రోజుల పాటు పనిచేసిన సంగతి తెలిసిందే. జూలై 30వ తేదీ నుంచి ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవడంతో పాటు అక్కడ గార్డ్ విధుల్లో ధోని పాల్గొన్నాడు. సుమారు రెండు వారాల పాటు ధోని భారత ఆర్మీకి సేవలందించాడు.

ఆగస్టు 15తో తన కాల పరిమితి ముగియడంతో

ఆగస్టు 15తో తన కాల పరిమితి ముగియడంతో

భారత ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆగస్టు 15తో తన కాల పరిమితి ముగియడంతో ఇంటికి చేరుకునేందు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ రెండు వారాల పాటు కశ్మీర్‌ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్‌ గార్డ్‌ డ్యూటీలను ధోని నిర్వర్తించాడు. ఇందులో భాగంగా విక్టర్‌ ఫోర్స్‌లో ధోని పనిచేశాడు.

కశ్మీర్‌లోని విక్టర్ ఫోర్స్‌లో

కశ్మీర్‌లోని విక్టర్ ఫోర్స్‌లో

విక్టర్ ఫోర్స్ కశ్మీర్‌లోని మిలిటెంట్ల ఏరివేతలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం లడఖ్‌ను కేంద్ర ప్రాంతపాలిత ప్రాంతంగా ప్రకటించింది. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ధోని లఢఖ్‌లో జెండా ఎగురువేసిన సంగతి తెలిసిందే. అనంతరం ధోని జనరల్ ఆసుపత్రిని సందర్శించి.. పేషంట్లతో మాట్లాడాడు.

ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ

ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ

ఈ సందర్భంగా ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ "ధోని భారత సైన్యం యొక్క బ్రాండ్ అంబాసిడర్. అతడు తన యూనిట్ సభ్యులను ప్రేరేపించడంలో నిమగ్నమయ్యాడు. తోటి సైనికులతో ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడాడు. ధోని కార్ప్స్‌తో యుద్ధ శిక్షణా వ్యాయామాలు కూడా నేర్చుకున్నాడు. ఆగస్టు 15 వరకు కశ్మీర్ లోయలోనే ఉన్నాడు" అని అన్నారు.

యురి, అనంత‌నాగ్‌లను సందర్శించిన ధోని

యురి, అనంత‌నాగ్‌లను సందర్శించిన ధోని

కశ్మీర్ లోయలో ధోని విధుల్లో ఉన్నప్పుడు యురి, అనంత‌నాగ్‌లను సైతం సందర్శించాడు. కాగా, ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను తనంతట తానుగా వెస్టిండిస్ పర్యటనకు దూరమయ్యాడు. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోని తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Saturday, August 17, 2019, 13:25 [IST]
Other articles published on Aug 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+