Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భార్య ఆత్మహత్య కేసులో పోలీస్ కస్టడీకి కబడ్డీ ఆటగాడు

న్యూఢిల్లీ: ప్రో కబడ్డీ లీగ్‌లో మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్న జాతీయ కబడ్డీ ఆటగాడు రోహిత్ చిల్లర్‌ను భార్య ఆత్మహత్య కేసులో పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారం అతడిని ఢిల్లీ కోర్టు డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు.

నేషనల్ కబడ్డీ ప్లేయర్‌ రోహిత్ భార్య ఉరేసుకుని ఆత్మహత్యదీంతో అక్టోబర్ 25 వరకు రోహిత్‌ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని న్యాయమూర్తిని పోలీసులు కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించడంతో రెండు రోజుల పాటు అతడిని పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో రోహిత్ తండ్రి విజయ్ సింగ్‌కు కోర్టు నవంబర్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Kabaddi Player Rohit Chillar sent to police custody

ఇండియన్ నేవీలో పనిచేస్తున్న రోహిత్ చిల్లర్‌ను భార్య ఆత్మహత్య కేసులో అక్టోబర్ 21న ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం శనివారం అతడిని ఢిల్లీకి తీసుకొచ్చారు. అక్టోబర్ 17న నార్త్ ఢిల్లీలోని తన అపార్టుమెంట్‌లో దుపట్టాతో ఉరివేసుకుని రోహిత్ భార్య లలిత బలవన్మరణానికి పాల్పడింది.

ఏం జరిగింది?: కబడ్డీ ప్లేయర్‌ రోహిత్ భార్య సూసైడ్ నోట్‌ ఇదేచనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌తో పాటు, రెండు గంటల పాటు రికార్డు చేసిన ఆడియో మెసేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో లలిత 'ఇంకా ఇలా బతికేంత శక్తి నాకు లేదు. చనిపోవాలని నిర్ణయించుకున్నా' అని రాసింది.

ఆరు నెలల క్రితం వీరి వివాహం జరిగింది. దీంతో పాటు వరకట్న వేధింపులను భరించలేకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఒక నోట్ కూడా పెట్టింది. సూసైడ్ నోట్ ఆధారంగా రోహిత్‌తో పాటు, అతని తల్లిదండ్రులపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:17 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+